బిల్ గేట్స్ దంపతులకు విడాకులు మంజూరు

బిల్ గేట్స్ దంపతులకు విడాకులు మంజూరు

ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్, మెలిందా గేట్స్ తమ 27 ఏళ్ల వివాహ బంధానికి అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాము విడిపోతున్నట్టు మూడు నెలల క్రితమే వారు ప్రకటించినా..  ఇవాళ(మంగళవారం) కోర్టు విడాకులను మంజూరు చేసింది. వాషింగ్టన్ లోని కింగ్ కౌంటీ కోర్టు జడ్జి వారి వివాహాన్ని రద్దు చేశారు.

విడాకుల అగ్రిమెంట్ కు తగ్గట్టు ఆస్తులను పంచుకోవాల్సిందిగా ఆదేశించారు. షరతుల ప్రకారం ఆ వివరాలన్నింటినీ రహస్యంగా ఉంచాలన్నారు. డైవర్స్ విషయం బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మెలిందా ఫ్రెంచ్ గేట్స్ పేరుతో 300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను బిల్ గేట్స్ బదిలీ చేశారు. ప్రస్తుతం గేట్స్ దగ్గర 15,000 కోట్ల డాలర్ల సంపద ఉంది. ఆ ఆస్తులను ఎలా డివైడ్ దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.

వాషింగ్టన్ రాష్ట్రం చట్టాల ప్రకారం.. పెళ్లి తర్వాత సంపాదించిన దాంట్లో దంపతులిద్దరికీ సమాన వాటా ఉంటుంది. దాని ప్రకారం ఆస్తిని న్యాయప్రకారం సమానంగా పంచాలని జడ్జి ఆదేశించారు.