
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కి నిధులను ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్‌గేట్స్ తప్పుబట్టారు. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం వణికిపోతున్న తరుణంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఈ సమయంలో డబ్ల్యూహెచ్‌వోకి నిధులు ఆపివేయడం ప్రమాదకరమన్నాడు. డబ్ల్యూహెచ్‌వో చేస్తున్న కృషి వల్లే ప్రస్తుతం కరోనా విస్తరణ తగ్గుతుందని.. ఆ సంస్థ పనిచేయడాన్ని ఆపివేస్తే మరే సంస్థ దాని స్థానాన్ని భర్తీచేయలేదని తెలిపారు.