
వాషింగ్టన్: అమెరికాలో చదువుకుంటున్న ఫారిన్ స్టూడెంట్లకు బ్యాడ్ న్యూస్. అక్కడ స్టడీ అయిపోయినంక ఏడాది పాటు ఉండేందుకు అవకాశం కల్పించే ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్(ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్‌లో బిల్లు పెట్టారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో పాల్ ఏ గోసర్, మో బ్రూక్స్, ఆండీ బిగ్స్, మాట్ గెట్జ్లు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది చట్టంగా మాకితే మన స్టూడెంట్లపై ఎఫెక్ట్ పడుతుంది. దాదాపు 80 వేల మంది మనోళ్లు ఓపీటీ కింద అమెరికాలో ఉంటున్నారు. ఓపీటీ అనేది గెస్ట్ వర్కర్ ప్రోగ్రామ్. ఫారిన్ స్టూడెంట్లు చదువుకునే టైమ్‌లో గానీ, చదువు అయిపోయినంక గానీ.. అక్కడ పని చేసుకునే వీలు కల్పిస్తుంది.