పిచ్చిపిచ్చి ఐడియాలొద్దు..ఆకాశంలో యాడ్స్ పై విమర్శలు

పిచ్చిపిచ్చి ఐడియాలొద్దు..ఆకాశంలో యాడ్స్ పై విమర్శలు

రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలకు బదులుయాడ్స్‌‌‌‌ కనబడితే ఎలా ఉంటుంది? ఓ రష్యన్‌‌‌‌ స్టార్టప్‌ కంపెనీ ఇలాంటి ప్రయత్నమే చేసింది. స్పేస్‌‌‌‌లో 500 కిలోమీటర్ల దూరంలో చిన్న చిన్న క్యూబ్‌ శాట్స్‌‌‌‌ సాయంతో యాడ్‌‌‌‌ను చూపించాలని ప్రయోగాత్మకంగా ట్రై చేసింది. కానీ ఈ బిల్‌‌‌‌బోర్డ్స్‌ యాడ్స్‌‌‌‌పై తీవ్ర విమర్శలొస్తున్నాయి. క్యూబ్‌ శాట్స్‌‌‌‌ వల్ల వచ్చే తీవ్రమైన కాంతి వల్ల ఆకాశంలో‘లైట్‌‌‌‌ పొల్యుషన్‌‌‌‌’ ఎక్కువయ్యే ప్రమాదముందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.సోషల్‌‌‌‌ మీడియాలోనూ ఈ తరహా ప్రయత్నంపై విమర్శలు ఎక్కువయ్యాయి. వాణిజ్య సంస్థల దురాశకు ఇది పరాకాష్టని నెటిజన్లు మండి పడుతున్నారు.ప్రపంచంలో ఎవరూ ఇలాంటి వాటిని కోరుకోవడంలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి పిచ్చిపిచ్చి ఐడియాలను ప్రయత్నించొద్దని, వీటికి ఖర్చుచేసే సొమ్మును కాస్త మంచి పనులకు వాడాలని సూచిస్తున్నారు. బిల్‌‌‌‌బోర్డ్‌‌‌‌ యాడ్స్‌‌‌‌ ప్రయత్నాన్ని పెప్సీ కంపెనీ ఇప్పటికే విరమించుకుంది. స్టార్ట్‌‌‌‌ రాకెట్‌‌‌‌ సంస్థ స్ట్రాటోస్పియర్‌‌‌‌లో అడ్వర్టైజ్‌ మెంట్స్‌‌‌‌ ఓసారి ప్రయోగాత్మకంగా తమకోసం యాడ్‌‌‌‌ను రూపొందించిందని పెప్సికో చెప్పింది. ఇలాంటి యాడ్స్‌‌‌‌ను కమర్షియల్‌‌‌‌గా వాడుకోడానికి ప్రస్తుతం నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. బిల్‌‌‌‌బోర్డ్‌‌‌‌ యాడ్స్‌‌‌‌లోక్యూ బ్‌ శాట్‌‌‌‌ శాటిలైట్లను వాడుతారు. శాటిలైట్‌‌‌‌ రిఫ్లెక్టర్లు సూర్యకాంతిని భూమివైపు పంపుతూ యాడ్స్‌‌‌‌ను ,మెసేజ్‌ లను చూపిస్తుంటారు. కావాల్సినప్పుడు శాటిలైట్‌‌‌‌ పిక్సెల్స్‌‌‌‌ను ఆన్‌‌‌‌, ఆఫ్‌ చేయొచ్చు. ఈ డిస్‌‌‌‌ప్లేభూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతుంటుంది.