ఇండియా చేజారిన ప్లే ఆఫ్స్ బెర్త్

ఇండియా చేజారిన ప్లే ఆఫ్స్ బెర్త్

చాంగ్షా (చైనా) : ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్‌‌‌‌‌‌‌‌ ఆసియా-ఓషియానియా టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌ చేరి చరిత్ర సృష్టించే సువర్ణావకాశాన్ని ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్ టీమ్ కొద్దిలో చేజార్చుకుంది. శనివారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–1 చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండియా 1-2 తేడాతో న్యూజి లాండ్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో రుతుజా భోసలే 6-2, 7-6(7/5)తో మోనిక్ బారీపై గెలిచి శుభారం భం చేసింది.

కానీ, రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అంకితా రైనా 2-6, 0-6తో  169వ ర్యాంకర్​లు సున్‌‌‌‌‌‌‌‌ చేతిలో పరాజయంపాలైంది. విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తేల్చే డబుల్స్‌‌‌‌‌‌‌‌ పోరులో అంకిత-ప్రార్థ నా తోంబరే 1-6, 5-7తో  పెయిగ్‌‌‌‌‌‌‌‌ హౌరిగన్‌‌‌‌‌‌‌‌-ఎరిన్ రౌట్‌‌‌‌‌‌‌‌లైఫే చేతిలో ఓడింది. ఆరు టీమ్స్‌‌‌‌‌‌‌‌ పోటీ పడ్డ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. వచ్చే ఏడాది కూడా గ్రూప్‌‌‌‌‌‌‌‌-1లోనే ఆడనుంది.