ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినేస్తున్నారా..?

ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినేస్తున్నారా..?

కొంతమందికి తిన్న కొంచెం సేపటికే మళ్లీ ఏదైనా తినాలని అనిపిస్తుంది. మరికొందరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినేస్తుంటారు. దీన్నే ‘బింజ్​ ఈటింగ్​’ అంటారు. ఈ అలవాటు వల్ల డయాబెటిస్, గుండె సమస్యలు వచ్చే ఛాన్స్​ ఉంది. లైఫ్​స్టయిల్​ మార్పులు చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు న్యూట్రిషనిస్ట్​లు. వీళ్లు చెప్తున్న కొన్ని టిప్స్​...

బింజ్​ ఈటింగ్​ని మానేయడం కోసం కొందరు ఏదో ఒక డైట్​ ఫాలో అవుతుంటారు. అయితే, డైటింగ్​లో ఫలానా ఫుడ్, ఫలానా మొత్తంలో తినాలని రూల్స్​ ఉంటాయి. దాంతో నచ్చిన ఫుడ్​ తినలేరు. దీని వల్ల కూడా బింజ్​ ఈటింగ్​ ఎక్కువయ్యే ఛాన్స్​ ఉంది.


 బ్రేక్​ఫాస్ట్​లో ఎనర్జీ ఇచ్చే న్యూట్రియెంట్​ఫుడ్​ ఉండాలి. ​అంతేకాదు రెగ్యులర్​ మీల్​ ప్లాన్​ని మిస్​ కావద్దు. 

ఫైబర్​ ఉండే బీన్స్​, బ్రకోలితో పాటు బెర్రీలు, అవకాడో, యాపిల్​ వంటివి తింటే పొట్ట నిండుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. 

యోగ, ధ్యానం  చేస్తే ఒత్తిడి తగ్గిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 
దాంతో బింజ్​ ఈటింగ్​కి దూరంగా ఉంటారు.