భారతదేశంలో జీవవైవిధ్యం

భారతదేశంలో జీవవైవిధ్యం

జీవావరణంలోని సమస్త జీవజాతుల మధ్య గల తేడాలు, వైవిధ్యతలే జీవవైవిధ్యత. భూమి మీద గల జీవ వైవిధ్యతను జన్యు వైవిధ్యత, జాతుల వైవిధ్యత, ఆవరణ వ్యవస్థల వైవిధ్యత స్థాయిల్లో అంచనా వేస్తారు. 2001 గ్లోబల్​ బయో డైవర్సిటీ ఔట్​లుక్​ ప్రకారం ప్రపంచంలోని అన్ని ఆవరణ వ్యవస్థల్లో కలిపి 140 మిలియన్ల జీవజాతులు నివసిస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటివరకు 1.74 మిలియన్ల జీవజాతులను గుర్తించి వాటిని వర్గీకరించారు. 

ఆర్ధ్రతతో కూడిన శీతోష్ణస్థితిని, వైవిధ్యభరితమైన నైసర్గిక స్థితిని కలిగి ఉండటం వల్ల 329 మిలియన్​ హెక్టార్ల విస్తీర్ణం గల భారతదేశ భూభాగంలో అత్యధిక జీవవైవిధ్యత కనిపిస్తుంది. ప్రపంచంలోని జీవ వైవిధ్యత 8 శాతం, దాదాపు 45,000 రకాలు చెందిన వృక్ష జాతులు, 81 వేల రకాల జంతు జాతులను కలిగి ఉంది.

మెగా డైవర్సిటీ

మెగా డైవర్సిటీ అనే భావనను యునైటెడ్​ నేషన్స్​ ఎన్విరాన్​మెంట్​ ప్రవేశపెట్టింది. ఒక దేశాన్ని మెగా బయోడైవర్సిటీ దేశంలో పేర్కొనాలంటే స్థానీయమైన జీవవైవిధ్యత ఎక్కువగా ఉండాలి, ప్రపంచంలో వృక్ష జాతుల్లో కనీసం 5000 జాతులు  ఆ దేశ భూభాగానికి స్థానీయమై ఉండాలి,  ఆ దేశంలోని జీవజాతుల్లో ఎక్కువ జాతులు ప్రమాదపు అంచుల్లో ఉండాలని ప్రమాణాలు తెలుపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 17 బృహత్​ జీవవైవిధ్యతా దేశాలతో భారతదేశం ఒకటిగా గుర్తించబడింది. అత్యధిక బృహత్​ జీవ వైవిధ్యత గల దేశం ఆస్ట్రేలియా కాగా, తర్వాత స్థానాల్లో కాంగో, మెడగాస్కర్, దక్షిణాఫ్రికా, చైనా, భారత్​, ఇండోనేషియా, మలేషియా, పాపూవా న్యూబీనియా, ఫిలిఫ్పైన్స్​, బ్రెజిల్​, కొలంబియా, ఈక్విడార్​, మెక్సికో, పెరూ, అమెరికా, వెనుజులా. ప్రపంచంలోని మెగా బయోడైవర్సిటీ దేశాలన్ని ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత జీవవైవిధ్యత గల దేశం ఆస్ట్రేలియా కాగా, రెండో స్థానంలో బ్రెజిల్​, ఏడో స్థానంలో భారతదేశం ఉంది. 
జన్యుపరంగా, జాతులపరంగా, ఆవరణ వ్యవస్థలపరంగా భారతదేశం అత్యధిక జీవవైవిధ్యతను కలిగి ఉండటానికి గల కారణాలు.. 

     టండ్రా ఆవరణ వ్యవస్థ మినహా అన్నిరకాల ఆవరణ వ్యవస్థలు భారతదేశ భూభాగంలో ఉండటం.
    భారతదేశం ఉష్ణమండల ఆర్ధ్రతతో కూడిన శీతోష్ణస్థితిలో ఉండటం.
    భారతదేశం భిన్ననైసర్గిక స్వరూపాలను కలిగి ఉండటం.
    ప్రపంచంలోని 36 ఎకలాజికల్​ హాట్​స్పాట్స్​లో నాలుగు భారతదేశంలో ఉన్నాయి.
    10 జీవ భౌగోళిక ప్రాంతాలు,16  వ్యవసాయ శీతోష్ణస్థితి ప్రాంతాలు,25 జీవ సరిహద్దులు, బయోమ్స్​ దేశ భూభాగంలో విస్తరించి ఉన్నాయి.
     ప్రపంచంలోని జీవవైవిధ్యతలో 7 శాతం వృక్షజాతులు, 8.1శాతం జంతు జాతులకు దేశం నిలయంగా ఉంది, 18 బయోస్పియర్​ ప్రాంతాలు,  7516 కి.మీ. పొడవైన సుదీర్ఘ తీరరేఖ వెంట అనేక సంఖ్యలో సముద్ర జీవ జాతులను కలిగి ఉండటం. 
పై అనుకూలతల కారణంగా ప్రపంచంలోని మొత్తం జీవవైవిధ్యతల భారతదేశం 8.22శాతం కలిగి ఉంది. ఇందులో ప్రపంచంలోని వృక్షజాతుల్లో 45,000 (7.31శాతం), జంతుజాతుల్లో 81,000(8.1శాతం) ఉన్నాయి. దేశంలోని వృక్షజాతుల్లో 33శాతం జంతుజాతుల్లో 50శాతం స్థానీయమైనవి ఉన్నాయి. ఇవి ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ కనిపించవు. నివసించవు. 
జంతు, వృక్ష వైవిధ్యతలతోపాటు 7500 కి.మీ. పొడవైన తీరరేఖ వెంట ఉన్న మాంగ్రూవ్స్​ (39), వెట్​ల్యాండ్స్​ (దేశ భూభాగంలో 4.6శాతం కలిగి 94 చిత్తడి నేలలు కలిగి ఉంది), ఎస్టురీస్​ ఆవరణ వ్యవస్థలు, భారత ప్రాదేశిక జలాల్లోని ప్రవాళ దీవులు భిన్న జాతుల క్రష్టేయన్లు, మొలస్కన్స్​, సముద్ర తాబేళ్లకు నిలయంగా ఉన్నాయి.  అంతేకాకుండా భారతదేశం పశువైవిధ్యతలో కూడా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ఉంది. 20 జాతుల పశువు, 40 జాతుల గేదెలు, 22 జాతుల మేకలు ఉన్నాయి. పైన తెలిపిన విశిష్టతల కారణంగా భాతరదేశాన్ని బృహత్​ జీవ వైవిధ్యతా మండలంగా పేర్కొంటారు. 

హిమాలయాలు :  ఇది పాకిస్తాన్​, నేపాల్​, భూటాన్, చైనా, భారత్​, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతమంతా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల అరణ్యాలతో కూడిన అత్యంత వైవిధ్యభరితమైన స్థానీయమైన పుష్పించే జాతి వృక్ష (రొడోడెండ్రాన్​) జంతు జాతులతో నిండి ఉంది. ఒకప్పుడు 3,40,000 చ.కి.మీ. విస్తీర్ణంలోని ఈ భూభాగం ప్రస్తుతం మానవ కార్యకలాపాల వల్ల 1,10,000 చ.కి.మీ. విస్తీర్ణానికి తగ్గిపోయింది. 

ఇండో బర్మన్​ ప్రాంతం :  గంగానది తూర్పు భాగం నుంచి బ్రహ్మపుత్ర లోతట్టు ప్రాంతాల వరకు (అండమాన్​ దీవులు మినహా) 23,37,000ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​, దక్షిణ అస్సాం రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇది స్థానీయ జాతుల నిలయం. ఈ హాట్​స్పాట్​లో 1200ల పక్షిజాతులు(ఇందులో 60 స్థానీయమైనవి), 13,500 వృక్ష జాతులు(ఇందులో 52శాతం స్థానీయమైనవి), 430 క్షీర జాతులు (70 స్థానీయమైనవి).

సుందా ల్యాండ్స్ :  ఇందులో భారతదేశంలోని నికోబార్ దీవులు ఉన్నాయి. దీనిలోని మిగిలిన ప్రాంతాలు ఇండో మలయన్​ ఆర్చిపెలాగోలోని పశ్చిమార్థభాగం,  దాదాపు 1700 సంఖ్యలో భూమధ్యరేఖా ప్రాంతంలోని దీవులు. వీటిలో అతిపెద్ద దీవులు ఇండోనేషియాలోని బోర్నియో సుమత్రా, మలేషియా, సింగపూర్, ఇండోనేషియాలోని పశ్చిమార్థ భాగం.

ఎకలాజికల్​ హాట్​స్పాట్స్​

పశ్చిమ కనుమలు - శ్రీలంకలోని ద్వీప సమూహాలు: ఈ హాట్​స్పాట్​ గుజరాత్​​లోని కథియవార్ నుంచి శ్రీలంకలోని తలైమన్నార్​ వరకు విస్తరించి ఉండి, భారతదేశంలో ఆరు రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. ఇందులో కేరళలోని అగస్త్యమలై కొండలు, సైలెంట్​ వ్యాలీ అనే రెండు ముఖ్యమైన జీవవైవిధ్య కేంద్రాలున్నాయి. ఈ ప్రాంతం 1700 కి.మీ. పొడవున, 1.60 లక్షల చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉష్ణమండల ఆర్ద్రతతో కూడి సతత హరితాల నుంచి ఆకురాల్చు అరణ్యాలు, పొదలతో కూడిన వృక్ష వైవిధ్యతను కలిగి ఉంది. 

జంతు వైవిధ్యత
కీటక జాతులు    65,900 జాతులు
వెన్నెముక లేని జీవులు    10,500 జాతులు
ఉభయచరాలు    182 జాతులు
చేపలు    2000 జాతులు
సరీసృపాలు    350 జాతులు
పక్షి జాతులు    1200 జాతులు
క్షీరదాలు    345 జాతులు 
వృక్ష వైవిధ్యత
పుష్పించే మొక్కలు    5000-7500
వన్యజాతి మొక్కలు    320 జాతులు
వ్యవసాయ పంటలు    167 జాతులు