హత్యకు గురైన హమాస్ బందీల్లో నేపాలీ స్టూడెంట్..మృతదేహం ఇజ్రాయెల్ కు అప్పగింత

హత్యకు గురైన హమాస్ బందీల్లో నేపాలీ స్టూడెంట్..మృతదేహం ఇజ్రాయెల్ కు అప్పగింత

ఇజ్రాయెల్-హమాస్ మధ్య రెండేళ్ల యుద్ధానికి తెరపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందంతో గాజాలో బందీగా ఉన్న 20 మంది ఇజ్రాయెల్ పౌరులు విడుదల చేసింది హమాస్ టెర్రరిస్టు గ్రూప్. ఇందులో హమాస్ చేతిలో నలుగరు బందీలు హత్యకు గురయ్యారు..వీరిలో నేపాల్ విద్యార్థి బిపిన్ జోషి (23) మృతదేహం కూడా ఉంది. మంగళవారం(అక్టోబర్ 13, 2025న)  నలుగురి మృతదేహాలను ఇజ్రాయెల్​ కు అప్పగించారు. బిపిన్ జోషి హమాస్ బందీగా ఉన్న ఏకైక హిందూ, విదేశీ (నాన్-ఇజ్రాయెలీ) వ్యక్తి.  ఇజ్రాయెల్ డీఎన్‌ఏ పరీక్షల తర్వాత మృతదేహం నేపాల్‌కు అప్పగించనుంది. 

ఎవరీ బిపిన్ జోషి..

2002లో నేపాల్​ లోనిపశ్చిమ ప్రాంతంలోని చిన్న గ్రామంలో జన్మించాడు బిపిన్​ జోషి..2023 సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్‌లోని లెర్న్ అండ్ ఎర్న్  కార్యక్రమంలో అగ్రికల్చర్​ స్టూడెంట్​గా చేరాడు. గాజా సరిహద్దు సమీపంలోని కిబ్బుట్జ్ అలుమిమ్‌లో 17 మంది నేపాలీ విద్యార్థులతో కలిసి పని చేశాడు. ఇక్కడ అల్పుడ్డు, పండ్లు, కోళ్లు పెంపకం, పరిశోధనలో శిక్షణ పొందాడు. 

2023 అక్టోబర్​7న ఇజ్రాయెల్​పై హమాస్​ఉగ్రవాదగ్రూపు దాడి చేసింది. ఈ దాడిలో 1200మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మంది హమాస్​ చేతిలో బందీలుగా పట్టుబడ్డారు. ఆ సమయంలో కిబ్బుట్జ్​ అలుమిమ్ పై కూడా దాడి జరిగింది. బంకర్ లో దాక్కున్న 17 నేపాలీలో 10 మంది మృతిచెందారు. బిపిన్​ హీరోలా హమాస్​ విసిరిన రెండు గ్రేనేడ్​ లలో ఒకటి బయటికి విసిరి తనతో ఉన్నవారిని కాపాడాడు. అయితే గాయపడిన బిపిన్​  హామాస్​ కు బందీగా దొరికాడు. 

బందీగా ఉన్న కాలం..కుటుంబ పోరాటం

దాదాపు రెండేళ్లకుపైగా 738 రోజులు గాజా టన్నెళ్లలో బందీగా ఉన్నాడు బిపిన్​ జోషి. 2023 నవంబర్​ లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్​ విడుదల చేసిన ఓ వీడియోలో బిపిన్​ జోషి ఉన్నట్లు తెలిసింది. నేను జీవించే ఉన్నాననంటూ వీడియోలో జోషి చెప్పడంతో అతని కుటుంబంలో ఆశలు చిగురించాయి. అయితే 2024 డిసెంబర్ నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో ఆందోళన చెందారు. 

బిపిన్​ జోషి పుష్పదాదాపు 8 గంటల ప్రయాణం చేసి ఖాట్మండులో అధికారులను కలిసి కొడుకుకోసం అభ్యర్థించింది. 2025 ఆగస్టులో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇస్సాక్ హెర్జాగ్‌ను కలిసింది. తెలావివ్ హోస్టేజ్ స్క్వేర్‌లో ప్రదర్శనలు చేశారు. హమాస్..నా కొడుకుని తిరిగి పంపండి అని తల్లి ఏడ్చింది. అమెరికాలో లాబీ చేశారు. నేపాల్ ప్రభుత్వం కతార్, జోర్డాన్, ఈజిప్ట్, అమెరికా ద్వారా దౌత్య ప్రయత్నాలు చేసింది.

బిపిన్​ మరణం.. మృతదేహం అప్పగింత.. 

2025 అక్టోబర్​ 13న బిపిన్​ చనిపోయినట్లు హమాస్​ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ IDF అధికారులు నేపాల్ రాయబారికి వీడియో కాల్‌లో చెప్పారు. చనిపోయిన 26 మంది ఇజ్రాయెల్ బందీల్లో బిపిన్​ కూడా ఉన్నాడని చెప్పారు. 

అక్టోబర్ 13 రాత్రి, హమాస్ నాలుగు కాఫిన్లలో మృతదేహాలు రెడ్ క్రాస్‌కు అప్పగించింది. ఇజ్రాయెల్ టెలావివ్‌కు తీసుకొచ్చి, ఫోరెన్సిక్ మెడిసిన్ సెంటర్‌లో డీఎన్‌ఏ పరీక్షలు చేస్తున్నారు. ధృవీకరణ తర్వాత IDF సైనిక గౌరవార్హ సల్యూట్‌ తర్వాత నేపాల్ రాయబారి కార్యాలయానికి అప్పగించనున్నారు. బిపిన్​ జోషి చాలా ధైర్యవంతుడంటూ నేపాల్​ విదేశాంగశాఖ కొనియాడింది.