త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా

త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా

అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ రాజీనామా చేశారు. ఢిల్లీ పర్యటన అనంతరం రాష్ట్రానికి వచ్చిన ఆయన... ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఇవాళ రాష్ట్రానికి చేరుకున్న బిప్లవ్ దేవ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ఎందుకు రాజీనామా చేశారన్న విషయం తెలియాల్సి వుంది. త్రిపుర అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. 35 స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ కి చెందిన  ఇద్దరు ఎమ్మెలేలు సుదీప్ రాయ్ బర్మన్, ఆశిష్ కుమార్ సాహా ఇటీవల పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో బీజేపీ బలం 33కు పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కు రెండు స్థానాలు మాత్రమే బీజేపీకి ఎక్కువగా ఉన్నాయి. ఇంకో ఏడాదిలో త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బిప్లవ్ రాజీనామా చేయడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని వార్తల కోసం...

సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ ను ప్రారంభించిన అమిత్ షా

కొడుకు మరణంతో కోడలికి మరో పెళ్లి