కేరళలో బర్డ్ ఫ్లూ : బాతులను చంపేస్తున్న అధికారులు

కేరళలో బర్డ్ ఫ్లూ : బాతులను చంపేస్తున్న అధికారులు

కేరళలో మరోసారి బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది.  . కేరళలోని అలప్పుజా జిల్లాలో రెండు చోట్ల బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు అధికారులు చెబుతున్నారు.  వీటిలో ఎడత్వ గ్రామ పంచాయతీలోని వార్డు నంబర్ 1, చెరుతన గ్రామ పంచాయతీలోని వార్డు నంబర్ 3 ఉన్నాయి.  పెంచిన బాతులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారణకుల వచ్చారు.  బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో బాతుల నమూనాలను పరిశీలించారు. ఈ నమూనాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపంగా.. అక్కడ వ్యాధి నిర్ధారించబడింది. శాంపిల్‌లో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (హెచ్5ఎన్1) ఉన్నట్లు నిర్ధారించారు.  

బర్డ్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు.  జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన జరిగిన  సమావేశంలో ఎపిక్ సెంటర్‌కు కిలోమీటరు పరిధిలో పెంచే పక్షులను చంపాలని నిర్ణయించారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి కిల్లింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టరేట్ నుండి ఆదేశాలు అందాయి. ఈ ప్రక్రియను నిర్వహించడానికి సరైన స్థలాలను ఈ రోజు చివరి నాటికి గుర్తిస్తామని ఎడతువా పంచాయతీ అధ్యక్షురాలు మరియమ్మ జార్జ్ తెలిపారు.  

మొత్తంగా దాదాపు 16 వేల బాతులను చంపేందుకు ఒకటి రెండు రోజులు పట్టవచ్చని పంచాయతీ అధికారి ఒకరు తెలిపారు.  బర్డ్ ప్లూ సోకిన బాతులు చాలా వరకు అనారోగ్యంతో ఉన్నాయని..  వాటి తలలు పడిపోతున్నాయన్నారు.   బర్డ్‌ఫ్లూ కేసులు పెరుగుతుండటం వలన  ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ..  దీని వలన మనుషులకు ఎలాంటి ప్రమాదం  ఉండదని అధికారులు చెబుతున్నారు.  ఈ వ్యాధి మనుషుల్లో వ్యాపించే అవకాశం లేదన్నారు.