ఆన్​లైన్​లో బర్త్​డే పార్టీ!

ఆన్​లైన్​లో బర్త్​డే పార్టీ!

‘నా బర్త్​డే లాక్​డౌన్ టైమ్​​లో వచ్చింది. లేదంటే ఫ్రెండ్స్​ అందర్నీ పిలిచి గ్రాండ్​గా చేసుకునేవాడ్ని’, ‘ఈ కరోనా గోల లేకుంటే నా బర్త్​డేని చాలా ఎంజాయ్​ చేసేదాన్ని…’ అనుకుంటున్న పిల్లల బాధని పేరెంట్స్​ దూరం చేయొచ్చు. అదెలాగంటారా? ‘డిజిటల్​ బర్త్​డే పార్టీ’ని ప్లాన్​ చేసి పిల్లలను బర్త్​డే రోజు థ్రిల్​ చేయొచ్చు. ‘డిజిటల్​ బర్త్​డే’ ప్లానింగ్​ ఎలా చేయాలంటే…

వెన్యూ – వీడియో కాలింగ్​

వీడియోకాల్​ టెక్నాలజీని బర్త్​డే పార్టీకి కూడా అప్లై చేయొచ్చు. వారం ముందుగానే వీడియో కాల్​​ లింక్​ని కావాల్సిన వాళ్లందరికీ షేర్​ చేయాలి. వారం రోజుల టైమ్​ వల్ల యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవడం​, మొబైల్ డేటా రీఛార్జ్​ వంటివి చూసుకుంటారు. ఒకవేళ ఎవరైనా వీడియో కాల్​ వాడడం తెలియదంటే వాళ్లకి ఈ వారం రోజుల్లోపు నేర్పించొచ్చు. ఇదంతా కరెక్ట్​గా ప్లాన్​ చేస్తే… బర్త్​డే సెలబ్రేషన్స్​ని ఫోన్​ లేదా లాప్​టాప్​ల్లో కేక్​ కటింగ్​, సెలబ్రేషన్స్​ని అందరితో లైవ్​లో షేర్​ చేసుకోవచ్చు.

ఆన్​లైన్​ గేమ్స్​

ఒకప్పుడు ఫోన్​లో గేమ్స్​ ఆడుతున్నారంటే.. పిల్లలను తెగ తిట్టేవాళ్లు అమ్మానాన్నలు. కానీ ఇప్పుడు వాళ్లే ప్లే స్టోర్ నుంచి గేమ్స్​ డౌన్​లోడ్​ చేసి మరీ ఆడుతున్నారు. ఈ గేమ్స్​ని కూడా బర్త్​డే పార్టీ ఫన్​లో యాడ్​ చేయొచ్చు. పిల్లల, పెద్దల ఇంట్రెస్ట్​ని బట్టి సెపరేట్​ ఆన్​లైన్​ గేమ్స్​ ప్లాన్​ చేయొచ్చు. సెలబ్రేషన్​ టైంలో అందరూ ఆన్​లైన్​లో ఆడుకోవచ్చు. ఇదీ.. ఒకరకమైన కమ్యూనికేషనే. కాబట్టి, అంతా ఎంజాయ్​ చేస్తారు.
బ్యాకప్​ ప్లాన్​

ఇలాంటి డిజిటల్​ సెలబ్రేషన్లకు అందరూ కొత్తే కాబట్టి కచ్చితంగా బ్యాకప్​ ప్లాన్​ ఉండాలి. ముందు అనుకున్నట్లు గేమింగ్​ యాప్స్​ పనిచేయకపోయినా, ఫోన్​ లేదా లాప్​టాప్​ కెమెరాతో ఫిజికల్​ గేమ్స్​ ప్లాన్​ చేసుకోవాలి. ఈ విషయాన్ని అందరికీ ముందుగానే చెప్పాలి. అలాగే పార్టీకి ఇంకా జోష్​ రావాలంటే.. వీడియో కాల్​​లో అంత్యాక్షరి, డాన్సింగ్​ గేమ్స్​ ఆడుకోవచ్చు.

డ్రెస్​​ థీమ్​

ఆన్​లైన్​ గెస్ట్​లందరికీ డ్రెస్​ థీమ్​ గురించి చెప్పాలి. అంటే పార్టీకి ఒక కలర్​ లేదా స్పెషల్​ థీమ్ అనుకోవాలి. అందరూ ఒకేరకంగా డ్రెస్​ చేసుకోవడం, ఒకే రంగు​ కాస్ట్యూమ్స్​ వేసుకోవడం థ్రిల్లింగ్​గా ఉంటుంది. అలాగే పెద్దలకు ఒక రకం, పిల్లలకు ఇంకోరకం థీమ్​ ఉంటే మరింత ఎంజాయ్​ చేయొచ్చు. పార్టీ జరిగే ఇంట్లో డెకరేషన్​ కూడా థీమ్​కి తగ్గట్టు ఉంటే చాలా బాగుంటుంది.

మెమరీ క్యాప్చర్స్​

డిజిటల్​ సెలబ్రేషన్స్​లో పార్టిసిపేట్​ చేస్తున్న వాళ్లందర్నీ… అప్పటికప్పుడు దిగిన ఫొటోలు పంపమని చెప్పాలి. అలాగే ఆన్​లైన్​ గేమింగ్, ఎంటర్​టైన్​మెంట్​ ప్రోగ్రామ్స్​ని వీడియోగా క్యాప్చర్​ చేయాలి. ఇలా అన్ని ఫొటోలు, వీడియోలను కలెక్ట్​ చేయాలి. ఫొటోలను, వీడియోలను సీడీల్లోకి కాపీ చేసుకుంటే… మళ్లీ మళ్లీ చూసుకోవచ్చు.

ఆన్​లైన్​ వర్క్​షాప్స్​ – కిడ్స్

పిల్లల బర్త్​డే ప్రతిఒక్కరికీ గుర్తుండి పోవాలంటే వర్క్​షాప్​ ఐడియా బాగుంటుంది. పెయింటింగ్​, డ్రాయింగ్​ టీచర్లతో ముందుగా మాట్లాడాలి. ఒక టైం ఫిక్స్​ చేసుకుని ఆ టైమ్​కి పిల్లలంతా కెమెరా ముందుకొస్తే, ఆ టీచర్​ చెప్పే ఇన్​స్ర్టక్షన్స్​​తో పెయింటింగ్​, డ్రాయింగ్​, పేపర్​ క్రాఫ్టింగ్​ చేయొచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం