
తనదైన నటనతో యూత్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీస్‌కు దగ్గరైంది సాయి పల్లవి. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒకటి ‘తండేల్’. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గురువారం సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన బర్త్‌డే గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తన జర్నీని చూపిస్తూ సాగిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది.
తెరపై ఆమె నటన గురించి అందరికీ తెలిసిందే.. కానీ సీన్‌లో కట్ చెప్పిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా అంటూ.. ‘తండేల్’ మేకింగ్‌ను కూడా చూపించారు. సెట్‌లో సరదాగా ఆమె చేసిన అల్లరితో ఫన్నీగా ఉందీ వీడియో. ‘నువ్వు ఏడిస్తే మేము ఏడుస్తాం, నువ్వు నవ్వితే మేము నవ్వుతాం.. నువ్వొక ‘గ్రేట్ పెర్ఫార్మెరే కాదు.. గ్రేట్ హ్యూమన్ బీయింగ్’ అంటూ సాయి పల్లవికి విషెస్ తెలియజేశారు.
ఇందులో నాగచైతన్యకు సాయిపల్లవి అన్నం తినిపిస్తున్న సీన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.