FirstCry గోదాములపై బీఐఎస్ అధికారుల దాడులు.. భారీగా ఆ సరుకు సీజ్..

FirstCry గోదాములపై బీఐఎస్ అధికారుల దాడులు.. భారీగా ఆ సరుకు సీజ్..

ఇటీవలి కాలంలో ఈకామర్స్ దిగ్గజ సంస్థలతో పాటు అనేక పెద్దపెద్ద సంస్థల గోదాములపై కూడా అధికారులు దాడులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రముఖ సంస్థ ఫస్ట్ క్రై గోదాముల్లో దాడులు నిర్వహించింది. బీఐఎస్ నిబంధనలు, క్వాలిటీకి విరుద్ధంగా ఉన్న సరుకును గుర్తించేందుకు ఈ సెర్చ్ జరిగింది. 

బీఐఎస్ చట్టం, 2016లోని హాల్ మార్కింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వస్తువులను దాడిలో అధికారులు బెంగళూరులో సీజ్ చేశారు. ఈ క్రమంలో ఏకంగా రూ.90 లక్షలు విలువైన వస్తువులను అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించారు. కొన్ని వస్తువులను కంపెనీ తగిన నాణ్యత అర్హతల కంటే తక్కువగా ఉన్నప్పటికీ విక్రయిస్తోందని తాము గుర్తించినట్లు వారు చెప్పారు. ఇది పూర్తిగా చట్టంలోని సెక్షన్ 14(6) ప్రకారం అతిక్రమణకు పాల్పడటంగా వారు చెప్పారు. దాడిలో పిల్లలకు సంబంధించిన తక్కువ నాణ్యత కలిగిన చెప్పులు, బొమ్మలు సహా మరిన్ని వస్తువులను అధికారులు సీజ్ చేశారు.

అయితే ఈ దాడులపై ప్రస్తుతం ఫస్ట్ క్రై సంస్థ న్యాయ నిపుణుల సలహాలకు అనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అయితే సీజ్ చేయబడిన వస్తువులు బీఐఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తాము అనుకోవటం లేదని కంపెనీ స్పష్టం చేసింది. దీనివల్ల తమ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

►ALSO READ | మేలో సున్నా స్థాయికి పడిపోయిన యూనిట్ విద్యుత్ ధరలు.. సామాన్యులకు బిల్ భారం తగ్గుతుందా..?

బీఐఎస్ కంపెనీకి బెంగళూరు రూరల్ జిల్లాలోని భీమక్కనహల్లి, సులిబిల హుబ్లి, హోస్ కోట్ తాలూకాల్లో ఉన్న గోదాములపై ప్రస్తుతం రెయిడ్స్ చేపట్టింది. తాజా చర్యల వల్ల కంపెనీకి పెద్దగా ఆర్థిక నష్టం కూడా జరగలేదని, దీనిని న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పింది. అయితే కంపెనీ విషయంలో ఇలా జరగటం ఇదే మెుదటిసారి కాదు. దీనికి ముందు నవంబర్ 2024లో ముంబై జీఎస్టీ అధికారుల దర్యాప్తులో కూడా కంపెనీ చిక్కుకుంది. మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.వెయ్యి 930 కోట్లుగా ఉండగా నికర నష్టం రూ.111.5 కోట్లుగా నమోదైంది. కంపెనీ నష్టాలు పెరగటంపై ప్రస్తుతం ఆందోళనలు పెరుగుతున్నాయి.