బిట్ బ్యాంక్: మహిళోద్యమాలు

బిట్ బ్యాంక్: మహిళోద్యమాలు

మహిళోద్యమాలు
 

 •     తెలంగాణలోని భూస్వాముల ఇళ్లల్లో ఉండే సాంఘిక దురాచారం ఆడపాప లేదా దాసి. 
 •     ఆడపాప లేదా దాసి అంటే భూస్వాములు వారి చెల్లెళ్లకు, కూతుళ్లకు వివాహమై అత్తగారింటికి వెళ్లేటప్పుడు వారి ఇళ్లల్లో పనిచేయడానికి అవివాహిత బాలికలను తోడుగా పంపించేవారు. ఇలా తోడు వచ్చిన బాలికలచేత భూస్వాములు వెట్టిచాకిరి చేయించుకోవడమే కాకుండా, శారీరకంగా కూడా ఉపయోగించుకునేవారు. ఇలాంటి బాలికలను ఆడపాప లేదా దాసి అంటారు. 
 •     తెలంగాణలోని కరీంనగర్​, మెదక్​, నిజామాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లో ఎక్కువగా ఉండే ఆచారం జోగినీ.
 •     జోగినీ అంటే దళిత కుటుంబాలకు చెందిన బాలికలను గ్రామదేవతలకు అంకితం చేసేవారు. గ్రామంలోని ధనవంతులు, పూజారులు, ఇతర గ్రామ ఉద్యోగులు వారిని శారీరకంగా ఉపయోగించుకునేవారు. ఇలాంటి బాలికలను జోగినీలు అంటారు. 
 •     బాలికల విద్య కోసం హైదరాబాద్​లో వివేకవర్ధిని బాలికల పాఠశాలను 1907లో స్థాపించారు. 
 •     బాలికల కోసం భాగ్యరెడ్డివర్మ ఆది ఆంధ్ర బాలికల పాఠశాల స్థాపించారు.
 •     హైదరాబాద్​లోని నారాయణగూడలో మాడపాటి హన్మంతరావు బాలికల పాఠశాలను స్థాపించారు.
 •     గ్రంథాలయాలను స్థాపించడం, సాంఘిక విషయాలను చర్చించడం, మూఢ నమ్మకాలు, మూఢాచారాలకు వ్యతిరేకంగా కృషి కోసం 1878లో అఘోరనాథ చటోపాధ్యాయ యంగ్​ మెన్స్​ ఇంప్రూవ్​మెంట్​ అసోసియేషన్​ను స్థాపించారు. 
 •     స్త్రీ విద్య కోసం కృషి చేసిన ముస్లిం సంఘ సంస్కర్త ముల్లా అబ్దుల్​ ఖయ్యూం.
 •     1907లో సీతాభాయి ఏర్పాటు చేసిన సంస్థ భారత మహిళా సంఘం.
 •     1905లో ఆంధ్ర సోదరి సమాజాన్ని నడింపల్లి సుందరమ్మ ఏర్పాటు చేసింది. 
 •     1922లో సికింద్రాబాద్​లో యువతీ శరణాలయాన్ని యామినీ పూర్ణ తిలకం స్థాపించింది. 
 •     1916లో అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్​ స్థాపించబడింది.
 •     ఆంధ్ర మహిళా సభ 1930లో ఏర్పడింది.
 •     1930 నుంచి 46 మధ్య ఆంధ్రమహాసభ 13 సమావేశాలు నిర్వహించగా, 10 మహిళా సమావేశాలు జరిగాయి. 
 •     ఆంధ్ర మహిళా సభ మొదటి సమావేశం జోగిపేటలో జరిగింది. 
 •     జోగిపేటలో జరిగిన ఆంధ్రమహిళా సభ మొదటి సమావేశంలో స్త్రీ విద్య, వివాహం, వితంతువుల స్థితి, వ్యభిచారం తదితర సమస్యలపై చర్చించారు. 
 •     రెండో ఆంధ్ర మహిళా సభ సమావేశం నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగింది. ఈ సభకు టి. వరక్ష్మమ్మ అధ్యక్షత వహించింది.
 •     1934లో ఖమ్మంలో జరిగిన మూడో ఆంధ్ర మహిళా సభ సమావేశానికి యల్లాప్రగడ సీతాకుమారి అధ్యక్షత వహించింది.
 •     మూడో ఆంధ్ర మహిళాసభ సమావేశంలో స్ర్తీల వివాహ వయసు మీద చర్చలు జరిగాయి.
 •     1935లో సిరిసిల్లలో జరిగిన నాలుగో ఆంధ్ర మహిళా సభ  సమావేశానికి మాడపాటి హన్మంతరావు సతీమణి మాణిక్యమ్మ అధ్యక్షత వహించింది.
 •     సిరిసిల్లలో జరిగిన నాలుగో ఆంధ్ర మహిళా సభ సమావేశంలో బాల్య వివాహాలు, నిర్బంధ ప్రాథమిక విద్యపై తీర్మానం చేశారు. 
 •     ఆంధ్రమహిళా సభ ఐదో సమావేశం షాద్​నగర్​లో జరిగింది.
 •     షాద్​నగర్ లో 1936లో జరిగిన సమావేశానికి బూర్గుల అనంతలక్ష్మి అధ్యక్షత వహించింది. 
 •     షాద్​నగర్​లో 1936లో జరిగిన ఆంధ్ర మహిళా సభ సమావేశంలో హిందూ స్త్రీలకు వారసత్వపు హక్కు, వర్ణాంతర వివాహం చేసుకున్న వారి సంతానానికి హక్కులు, బాల్య వివాహాల నిషేధం, అస్పృశ్యత నివారణ, జాగీరు రైతుల హక్కులపై చర్చించారు. 
 •     1937లో నిజామాబాద్​లో జరిగిన ఆంధ్ర మహిళా సభ సమావేశంలో కార్నీలియస్​, నందిని పాల్గొన్నారు.
 •     నిజాం సంస్థానంలో శాసనంగా రూపొందిన ప్రథమ సాంఘిక సంస్కరణ వితంతు వివాహం.
 •     1940లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన ఎనిమిదో ఆంధ్ర మహిళా సభకు రంగమ్మ ఓబుల్​రెడ్డి అధ్యక్షత వహించింది.