5 వేల డాలర్ల మార్క్‌ అందుకున్న బిట్ కాయిన్

5 వేల డాలర్ల మార్క్‌ అందుకున్న బిట్ కాయిన్
  • బిట్ కాయిన్ మళ్లీ మెరిసింది
  • అనూహ్యంగా 20 శాతానికి పైగా జంప్
  • మిస్టరీ బయ్యర్.. భారీ ఆర్డర్

బిట్‌‌కాయిన్ ధర అనూహ్యంగా మెరిసింది. హఠాత్తుగా గత ఐదు నెలల గరిష్టానికి ఎగిసింది. రెండు రోజుల్లోనే 20 శాతానికి పైగా పెరిగిన బిట్‌‌కాయిన్ ధర, కొన్ని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్‌ లలో 5 వేల డాలర్ల మార్క్‌‌ను చేరుకుంది. ఇంత సడన్‌ గా బిట్‌‌కాయిన్ ధర పెరగడానికి కారణమేమిటి..? ఎవరో తెలియని వ్యక్తి 10 కోట్ల డాలర్లవిలువైన ఆర్డర్‌‌‌‌ను మూడు ప్రధాన బిట్‌‌కాయిన్ ఎక్స్చేంజ్‌ లలో పెట్టడటం వల్లే ధర అకస్మాత్తు గా పెరిగిందని భావిస్తున్నారు. ఈ భారీ ఆర్డర్ నేపథ్యంలోనే ట్రేడింగ్ పరిణామం కూడా చాలా ఎక్కువైంది. అమెరికాకు చెందిన కాయిన్ బేస్, క్రాకెన్, లక్సెం బర్గ్‌‌కు చెందిన బిట్‌ ‌స్టాంప్‌ ఎక్స్చేంజీల్లో సుమారు 20 వేల బిట్‌‌కాయిన్లు చేతులు మారాయని లండన్‌ కు చెందిన క్రిప్టోకరెన్సీ సంస్థ బీసీబీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓలివర్ వాన్ లాండ్స్‌‌బర్గ్ సాడీ చెప్పారు. గంటకు 7 వేల బిట్‌‌కాయిన్లు చేతులు మారినట్టు పేర్కొన్నారు.

బిట్‌‌కాయిన్ అనేది వర్చ్యు వల్ కరెన్సీ. 2017 చివరిలో దీనికి పెద్ద ఎత్తున డిమాం డ్ వెల్లువెత్తింది. దీంతో బిట్‌‌కాయిన్ ధర ఆకాశాన్నంటింది. ప్రస్తుతం 5 వేల డాలర్లుగా ఉన్న ఈ బిట్‌‌కాయిన్ ధర ఒకప్పుడు 20వేల డాలర్లు పలికింది. ఒక్క బిట్‌‌కాయిన్ ఉంటే చాలు లక్షాధికారులం  అయిపోవచ్చని చాలా మంది కొన్నేళ్ల కిందట గంపగుత్తుగా దీని కొనుగోళ్లు చేపట్టారు. అయితే ఈ వర్చ్యు వల్ కరెన్సీ ప్రమాదకరమని భావించిన కొన్ని దేశాల ప్రభుత్వాలు, దీనిని చట్టవిరుద్ధమైన కరెన్సీ గా ప్రకటించడంతో బిట్‌‌కాయిన్ విలువ ఒక్కసారిగా కుదేలైంది. దీనిలో పెట్టుబడులు పెట్టిన చాలా మంది భారీగానే నష్టపోయారు. ప్రస్తుతం బిట్‌‌కాయిన్ ధరకు మళ్లీ ఊపువచ్చింది. ఒక మిస్టరీ కొనుగోలుదారు చేపట్టిన ఈ ఆర్డర్‌‌‌‌తో బిట్‌‌కాయిన్ ధర అమాంతం పెరిగింది. అయితే ఈ కొనుగోలు ఎవరు చేపట్టారు..? బిట్‌‌కాయిన్‌ కు కృత్రిమంగా డిమాండ్ పెంచడానికే ఈ ఆర్డర్‌‌‌‌ను పెట్టారా ..? అలా చేయడం ధరలు పెంచేందుకే-నా ..? అనే ప్రశ్నలకు మాత్రం ఇంకా సమాధానం దొరకలేదు.

ఇతర క్రిప్టో కరెన్సీలకు ఊపు

బిట్‌‌కాయిన్ ధర పెరగడంతో ఇతర క్రిప్టోకరెన్సీ లకు కూడా ఊపు వచ్చిం ది. ఇథెరియం, ఎక్స్‌‌ఆర్పీ(రిప్పిల్)వంటివి 5 శాతం చొప్పున పెరిగాయి. ఈఓఎస్‌ లు 8శాతానికి పైగా, లైట్‌‌కాయిన్ 10 శాతానికి పైగా లాభపడ్డాయి. కాయిన్‌ మార్కెట్‌‌క్యాప్ ట్రాక్ చేసే టాప్100 క్రిప్టోకరెన్సీల్లో కేవలం ఆరు మాత్రమే నష్టపో-గా.. మిగిలినవన్నీ గరిష్ట స్థా యిల్లోనే ట్రేడయ్యా యి.సాధారణంగా బిట్‌‌కాయినే మార్కెట్‌‌కు లీడర్‌‌‌‌గాఉంటుం దని, అది పెరిగితే మిగిలిన కాయిన్లు కూడా అదే ట్రెండ్‌‌ను ఫాలో అవుతాయని ఇజ్రాయిల్‌ కు చెందిన విశ్లేషకుడు మటి గ్రీన్‌ స్పాన్‌ చెప్పారు. నేడు బిట్‌‌కాయిన్ డ్రైవింగ్‌‌ సీట్‌‌లో ఉందన్నారు. 5 వేల డాలర్లకు చేరకముందు, గత కొంత కాలంగా బిట్‌‌కాయిన్ ధర క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్‌ లలో 3,300 డాలర్లనుంచి 4,200 డాలర్ల మధ్యలో ట్రేడయ్యేది.