రేవంత్.. బాబుని చూసి నేర్చుకో : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

రేవంత్.. బాబుని చూసి నేర్చుకో : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
  • ప్రజా ధనాన్ని వృథా చేస్తే ఊరుకోం

  •  అధ్యక్షుడి మార్పుపై త్వరలో నిర్ణయం

  • బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: సీఎం రేవంత్​రెడ్డి పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రికి మూడు రోజుల క్రితం లేఖ రాశానని తెలిపారు. ఇవాళ మహేశ్వర్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ  ‘ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే వృద్ధాప్య పెన్షన్లను 2 వేల నుంచి 4 వేలు పెంచుతూ సంతకం పెట్టారు. 

తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్లు 4 వేలు చేస్తా రేవంత్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. సర్కార్​బడుల్లో ఫస్ట్​క్లాస్​నుంచి టెన్త్​వరకు పంపిణీ చేసే పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చి మళ్లీ తీసుకున్నారు. రాష్ట్ర ఖజానాపై మరో భారం పడుతుంది. వ్యక్తిగత కారణాలతో ప్రజా ధనాన్ని వృథా చేస్తే ఊరుకోం. అధికారుల నిర్లక్ష్యం వల్ల కేసీఆర్ బొమ్మ పుస్తకాలపై వచ్చి ఉండొచ్చు, వారి పై చర్యలు తీసుకోవాలి. కానీ ఇచ్చిన పుస్తకాలు తీసుకోవద్దు. పుస్తకాలపై జాతీయ గీతం ఉందని తెలిసింది దాన్ని తీసేయడం మంచి పద్దతి కాదు. ఏపీలో గత ముఖ్యమంత్రి బొమ్మ ఉన్న పుస్తకాలు పిల్లలకు ఇచ్చారు. అధ్యక్షుడి మార్పుపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలు బీఆర్ఎస్,కాంగ్రెస్ అవినీతిని చూశారు. ప్రజలు మా వైపు  ఉన్నారు. ఏ స్కాం జరిగిన దానిపైన విచారణ జరుగుతుంది’ అని తెలిపారు.