పెట్రో ధరల పెంపుపై బీజేపీ మిత్రపక్షాల ఆగ్రహం

పెట్రో ధరల పెంపుపై బీజేపీ మిత్రపక్షాల ఆగ్రహం

న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపుపై బీజేపీ భాగస్వామ్యపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలపై పెనుభారం మోపుతున్న మోడీ సర్కారుపై మండిపడుతున్నాయి. గత 15 రోజులుగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీజేపీ మిత్రపక్షం జనతాదళ్ (యూ) డిమాండ్ చేసింది. ఇంధన ధరల పెంపు ప్రజలపై పెను ప్రభావం చూపుతుందని పెరిగిన ధరలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు.

ఇదిలా ఉంటే ఇంధన ధరల పెంపును కేంద్రం సమర్థించుకుంటోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పదింట ఒకవంతు కూడా లేదని అంటోంది. ఇంధన ధరల పెంపుపై లోక్ సభలో మాట్లాడిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.. మార్చ్, ఏప్రిల్ నెలల్లో అమెరికాలో పెట్రోల్ ధరలు51శాతం పెరగగా.. కెనడాలో 52శాతం, జర్మనీలో 55, యూకేలో 55, ఫ్రాన్స్ లో 50, స్పెయిన్ లో 58శాతం మేర పెరిగితే భారత్లో మాత్రం కేవలం 5శాతం మాత్రమే పెరిగాయని ప్రకటించారు.