రాజ్యసభ ఎన్నికలకు ఇంచార్జ్లను నియమించిన బీజేపీ

రాజ్యసభ ఎన్నికలకు ఇంచార్జ్లను నియమించిన బీజేపీ

జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ ఇంచార్జులను నియమించింది . హర్యానా, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్రలకు ఎన్నికల ఇంచార్జులుగా కేంద్రమంత్రులను నియమించింది. కర్ణాటకకు కిషన్ రెడ్డి, మహరాష్ట్రకు అశ్విన్ వైష్ణవ్, రాజస్థాన్ కు నరేంద్ర సింగ్ తోమర్, హర్యానాకు గజేంద్ర సింగ్ షేకావత్ ను నియమించింది. జూన్ 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఈ నాలుగు రాష్ట్రాల నుండి ఎక్కువ సీట్లు సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 22మందిని నిలబెట్టింది. రాజస్థాన్ లో స్వతంత్ర అభ్యర్థి జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రకు బీజేపీ మద్ధతు ఇస్తుంది.

యూపీ నుండి 8మంది, కర్ణాటక నుండి ముగ్గురు, మహారాష్ట్ర నుండి ముగ్గురు, బీజేపీ, మధ్యప్రదేశ్ నుండి ఇద్దరు, రాజస్థాన్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హర్యానా నుండి ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులను నిలబెట్టింది.ఇక కర్ణాటకలో అదనపు అభ్యర్థులను బరిలోకి దింపాయి బీజేపీ,కాంగ్రెస్. కాంగ్రెస్ జనతాదళ్ మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కర్ణాటక నుండి కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నామినేషన్ దాఖలు చేశారు.

మరిన్ని వార్తల కోసం

ప్రధానిని కలిసిన నిఖత్ జరీన్

దేశభక్తుడన్న కేజ్రీవాల్..16కోట్లు నొక్కేశారన్న స్మృతి ఇరానీ