దేశభక్తుడన్న కేజ్రీవాల్..16కోట్లు నొక్కేశారన్న స్మృతి ఇరానీ

దేశభక్తుడన్న కేజ్రీవాల్..16కోట్లు నొక్కేశారన్న స్మృతి ఇరానీ

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయినా సత్యేంద్ర జైన్ దేశభక్తుడని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.  దేశం ఆయ‌న ప‌ట్ల గ‌ర్వంగా ఫీల‌వ్వాల‌న్న ఆయన పద్మవిభూషన్ ఇవ్వాలని సూచించారు. ఢిల్లీకి మొహల్ల క్లినిక్ లు పరిచయం చేసిందే ఆయన అన్నారు. ప్రపంచదేశాల నుంచి ఎంతోమంది వచ్చి ఆ క్లినిక్ లను విజిట్ చేస్తున్నట్లు తెలిపారు. జైన్ కు సీబీఐ ఇప్పటికే క్లీన్ చీట్ ఇచ్చిందని..ఈడీ కూడా ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే కేజ్రీవాల్ కామెంట్స్ కు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. మనీలాండరింగ్ లో ఉన్న వ్యక్తికి ఎలా క్లీన్ చీట్ ఇస్తారని అడిగారు. 56 షెల్ కంపెనీల ద్వారా 16.39కోట్లు ల్యాండరింగ్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. లెక్కల్లో లేని ఆ 16 కోట్లు అంకుష్ జైన్, వైభవ్ జైన్ లకు చెందిందని అదాయపన్ను శాఖ కమిషనర్ చెప్పింది నిజం కాదా అని నిలదీశారు.

మనీల్యాండరింగ్ అయిన డబ్బుకు సత్యేంద్ర జైన్ ఓనర్ అని 2019లో ఢిల్లీ హైకోర్టులో తీర్పిచ్చినట్లు స్మృతి ఇరానీ తెలిపారు. ప్రయాస్ ఇన్ఫో సొల్యూషన్స్, ఇండో మెటల్ ఇంప్లెక్స్, అకించన్ డెవలపర్స్ వంటి షెల్ కంపెనీలతో సత్యేంద్ర జైన్ లబ్దిపొంద లేదా అని క్వశ్చన్ చేశారు.

మరిన్ని వార్తల కోసం

హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

లోన్ యాప్స్ కేసులో స్పీడ్ పెంచిన ఈడీ