రాజస్థాన్ సీఎం రేసులో 9మంది మహిళలు?

రాజస్థాన్ సీఎం రేసులో 9మంది మహిళలు?

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల జరగ్గా..తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్,మిజోరాం లలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఒక్క రాజస్థాన్ మిగిలింది. పెద్ద రాష్ట్రం.. బీజేపీ మంచి బలమున్న రాష్ట్రం కావడంతో అధిష్టానం  సీఎంగా ఎవరిని నియమిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసొస్తుందనే దానిపై దృష్టి పెట్టింది.. ఈ క్రమంలో రాజస్థాన్ సీఎం ఎవరూ అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రాజస్థాన్ సీఎంగా నారీ శక్తిని నియమించాలనే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. 

రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. ప్రధాన పోటీదారులుగా మహిళా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అయింగే మంగళవారం (డిసెంబర్12)  సాయంత్రం 4 గంటల జరిగే బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో ఈ సందిగ్ధతతకు తెరపడే అవకాశం ఉంది. కేంద్ర పరిశీలకులు రాజ్ నాథ్ సింగ్, సరోజ్పాండే, వినోద్ తావ్డే సమక్షంలో రాజస్థాన్ సీఎం ను ప్రకటించనున్నారు. 

సీఎం రేసులో ఉన్న మహిళా నేతలు 
సీఎం రేసులో ఉన్న మహిళా నేతల్లో ప్రధానంగా వసుంధరా రాజే సింధియా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వసుంధరా రాజే ఝల్రాపటన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంలాల్  చౌహాన్ పై 53, 193 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరో మహిళానేత  దియా కుమారి కూడా సీఎం రేసులో ఉన్నారు. విద్యాధర్ నగర్ నుంచి ప్రత్యర్థిపై 71వేల 368 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. మరో కీలక నేత అనితాబాదేల్.. అజ్మీర్ సౌత్ నుంచి ప్రత్యర్థిపై 4వేల 446ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వీరితోపాటు సిద్ధికుమారి, డాక్టర్ మంజు బాగ్మార్, దీప్తీ కిరణ్ మహేశ్వరి, కల్పానా దేవి, శోభా చౌహాన్, నౌక్షం చౌదరి వంటి మహిళా నేతలు సీఎం రేసులో ఉన్నారు. 

నారీశక్తిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం రాజస్థాన్ సీఎంగా మహిళా నేతకు అవకాశం ఇస్తుందా.. లేక మరో కొత్త ముఖాన్ని సీఎం గా ప్రకటిస్తుందా అనేది మంగళవారం (డిసెంబర్12) సాయంత్రం జరిగే రాజస్థాన్ బీజేపీ శాసన సభా పక్ష  సమావేశంలో తేలనుంది. రాజస్థాన్ సీఎం ప్రకటనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.