రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

రేపు (3 ఫిబ్రవరి 2022) రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భీం దీక్ష చేసేందుకు సిద్ధం అవుతున్నారు ఆ పార్టీ ముఖ్య నేతలు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ భీం దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గురువారం  మండల కేంద్రాల్లో ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు బీజేపీ భీం దీక్ష చేయనున్నారు.

హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష చేయనున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, రాజాసింగ్ సహా ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ తెలంగాణ భవన్‌లో నిరసన వ్యక్తం చేసిన ఆయన.. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ దిమ్మతిరిగింది