కేసీఆర్​ అంటేనే మోసం : గూడూరు నారాయణరెడ్డి

కేసీఆర్​ అంటేనే మోసం : గూడూరు నారాయణరెడ్డి

యాదాద్రి, వెలుగు : కేసీఆర్‌‌ అంటేనే మోసానికి ప్రతిరూపమని, గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చాలేదని -బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి విమర్శించారు. బుధవారం బీబీనగర్ మండలం నెమరగొముల, మీది తండా, రాయరావుపేట, జియాపల్లి, జియాపల్లి తండా,  జమీలపేట్​లో  మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రధాని మోడీ అంటే నమ్మకమని, బీజేపీకి ఓటేసి తనకు మద్దతివ్వాలని కోరారు.  మూసీ కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నా ఎమ్మెల్యే పైళ్ల పట్టించుకోలేదని మండిపడ్డారు.

తాను గెలిచిన 18 నెలల్లో కాలుష్యంతో నిండిపోయిన మూసీ నదిని ప్రక్షాళన చేయిస్తానని  హామీ ఇచ్చారు. పోటీ పరీక్షల కోసం స్టూడెంట్స్​కు కోచింగ్​ ఇప్పిస్తానని, భువనగిరిలో ఐటీ హబ్​ ఏర్పాటు చేయించి.. 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని మాటిచ్చారు.  సొంత ఖర్చుతో డిగ్రీ కాలేజీ కట్టిస్తానని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని మోదీ అనుకూలంగా ఉన్నందునే కమిటీ వేశారని చెప్పారు.

అనంతరం సందర్భంగా ఎస్సీలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.  ప్రచారంలో పార్టీ నేతలు పడమటి జగన్ మోహన్ రెడ్డి, నర్ల నర్సింగ్ రావు. సురకంటి జంగారెడ్డి, గడ్డం జంగారెడ్డి,  ఇంజమూరి ప్రభాకర్, సాయి,వినోద్, రాజేందర్, సుదర్శన్, చంద్రమౌళి, చింటు, నర్సింహ పాల్గొన్నారు.