ఇండియా కూటమిని బలహీనపర్చేందుకు బీజేపీ కుట్ర : సీపీఐ నారాయణ

ఇండియా కూటమిని బలహీనపర్చేందుకు బీజేపీ కుట్ర : సీపీఐ నారాయణ

 హైదరాబాద్, వెలుగు: ఓటమి భయంతోనే ‘ఇండి యా’ కూటమిని బలహీనపర్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ విమర్శించారు. ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషించిన బీహార్ సీఎం సీఎం నితీశ్​కుమార్ ‘కక్కిన కూడు తినేందుకే’ తిరిగి ఎన్ డీఏ కూటమిలోనికి వెళ్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మగ్దూం భవన్​లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ పదేండ్ల కాలంలో సాధించింది ఏమీ లేదని, అందుకే ‘శ్రీరాముని’ పేరుతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

వచ్చే నెల 2 నుంచి జాతీయ సమితి సమావేశాలు    

హైదరాబాద్ లో ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో  సీపీఐ జాతీ య సమితి సమావేశాలు జరగనున్నాయని నారాయణ తెలిపారు.  కాంగ్రెస్ విశాల దృక్ఫథంతో ఆలోచించి దేశంలోని చిన్నా, పెద్ద రాజకీయా పార్టీ లను కలుపుకుని ముందుకు పోవాలని చెప్పారు. అప్పుడు మాత్రమే మోదీని ఓడించే అవకాశం ఉంటుందని పే ర్కొన్నారు. వరంగల్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్స్ లో ఒక్క సీటు ఇచ్చినా కాంగ్రెస్​తో కలిసి పోటీ చేస్తామని వివరించారు.