పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ఫోకస్

పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్​పెట్టింది. ఎంపీ సీట్ల వారీగా నియోజకవర్గ సన్నాహక సమావేశాలను ప్రారంభించింది. ఆదివారం జరిగిన ఆదిలాబాద్, నిజామాబాద్ ఎంపీ సీట్ల సమావేశాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) చంద్రశేఖర్ తివారి పాల్గొన్నారు. సోమవారం నిర్వహించనున్న జహీరాబాద్ మీటింగ్ లో పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ తరుణ్​ చుగ్ పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఆదివారం ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు.

6న జరగనున్న భువనగిరి సమావేశానికి కిషన్ రెడ్డి, చేవేళ్ల మీటింగ్ కు లక్ష్మణ్​, పెద్దపల్లి మీటింగ్ కు బండి సంజయ్, మహబూబ్ నగర్, వరంగల్ సమావేశాల్లో ఈటల రాజేందర్ పాల్గొంటారని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. అయోధ్యకు రైలుసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరే మొదటి రైలును కిషన్ రెడ్డి ప్రారంభిస్తారని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఆయన చెప్పారు.