గుండాల, వెలుగు: కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మండలంలోని కాచనపల్లి, శెట్టిపల్లి, శంభునిగూడెం, గలభ, లింగగూడెం, రోల్లగడ్డ పంచాయతీలలో పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు.
గుండాల మండలంలో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్న ప్రతి దగ్గర ఓటర్లు సహకరించి సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎస్ఆర్, పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఎస్కే ఖదీర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దార అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఆయా గ్రామ పంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు, ముఖ్య నాయకులు ఎస్కే అబ్దుల్ నభి, ఎస్కే వాజీద్, కాసీం, బొంగు చంద్రశేఖర్, పల్లపు రాజేశ్, సోషల్ మీడియా నాయకులు మండలోజు కిరణ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
