గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది : ఎమ్మెల్యే మట్టా రాగమయి

గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది : ఎమ్మెల్యే మట్టా రాగమయి
  • కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
  • ఎమ్మెల్యే మట్టా రాగమయి

తల్లాడ, వెలుగు : పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదివారం తల్లాడ మండలంలోని కలకొడిమ, కుర్నవల్లి, ముద్దనూరు, కేశవాపురం, పినపాక, తల్లాడ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉచిత బస్సు, కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత గ్యాస్, రైతు భరోసా వంటి పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామస్థాయి నుండే అండగా నిలబడి గ్రామాలు మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రజల సహకరించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులపై ఓట్లేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తల్లాడ మండల అధ్యక్షుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్, దిరిశాల నరసింహారావు, జక్కంపూడి కిషోర్, నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.