ఇండియన్ ఆర్మీలో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా.. ? అయితే, ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోండి..

ఇండియన్ ఆర్మీలో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా.. ? అయితే, ఈ ఎగ్జామ్ కి అప్లై చేసుకోండి..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్​సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ (I) 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ మిలటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్​ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీల్లో ప్రవేశాల కోసం మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్ఎస్​సీ మహిళలు (నాన్ టెక్నికల్) పోస్టులు కూడా ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ  డిసెంబర్30. 

  • పోస్టుల సంఖ్య: 451.
  • ఖాళీల వివరాలు: ఇండియన్ మిలటరీ అకాడమీ, డెహ్రాడూన్– 162వ (డీఈ) కోర్స్ (ఆర్మీ వింగ్ ఎన్ సీసీ–సీ సర్టిఫికెట్ 13 పోస్టులతో కలిపి) 100, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమాల ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)/ హైడ్రో (నేవల్ వింగ్ ఎన్​సీసీ–సీ సర్టిఫికెట్ 06, హైడ్రో 01 పోస్టులతో కలిపి) 26, ఎయిర్​ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ (ప్రీ ప్లైయింగ్) ట్రైనింగ్ కోర్స్ 221 ఎఫ్​(పీ) (ఎయిర్​ఫోర్స్ వింగ్ ఎన్​సీసీ– సీ సర్టిఫికెట్ 03 పోస్టులతో కలిపి) 32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై 12వ ఎస్ఎస్​సీ (మెన్) (ఎన్​టీ) (యూపీఎస్​సీ) కోర్స్ 275, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై 125వ ఎస్ఎస్​సీ వుమెన్  (ఎన్​టీ) (యూపీఎస్​సీ) కోర్స్ 18. 
  • ఎలిజిబిలిటీ
  • ఐఎంఏ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డ్ నుంచి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • ఇండియన్ నేవల్ అకాడమీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • ఎయిర్​ఫోర్స్ అకాడమీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (10+2 స్థాయిలో భౌతికశాస్త్రం, గణితం చదివి ఉండాలి) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉండాలి.
  • గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం/ సెమిస్టర్  చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
  • వయోపరిమితి ( 2027, జనవరి 01 నాటికి)
  • ఐఎంఏ, ఇండియన్ నేవల్ అకాడమీ: 2003, జనవరి 2 కంటే ముందు, 2008, జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు. 
  • ఎయిర్​ఫోర్స్ అకాడమీ: 20 నుంచి 24 ఏండ్ల మధ్యలో ఉండాలి. (2003, జనవరి 2 కంటే ముందు 2007, జనవరి 01తర్వాత జన్మించకూడదు). చెల్లుబాటు అయ్యే కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 26 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది
  • ఓటీఏ  (ఎస్ఎస్​సీ పురుషులు): 2002, జనవరి 02 కంటే ముందు, 2008, జనవరి 01వ తేదీ తర్వాత జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు. 
  • ఓటీఏ (ఎస్ఎస్​సీ మహిళలు): 2002, జనవరి 02 కంటే ముందు 2008, జనవరి 01వ తేదీ తర్వాత జన్మించిన అవివాహిత మహిళలు, సంతానం లేని వితంతులు/ విడాకులు పొందినవారు అర్హులు. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 10.
  • అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళా  అభ్యర్థులకు ఫీజు లేదు. 
  • లాస్ట్ డేట్: డిసెంబర్ 30.
  • ఎగ్జామ్ డేట్​: 2026, ఏప్రిల్ 12. 
  • అడ్మిట్ కార్డ్: పరీక్షకు ఒక వారం ముందు. 
  • పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్, హన్మకొండ, ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
  • ఫలితాల వెల్లడి: 2026, మే (తేదీ తాత్కాలికం) 
  • కోర్స్ ప్రారంభం (ఐఎంఏ/ ఐఎన్ఏ/ ఏఎఫ్ఏ): 2027, జనవరి.
  • కోర్స్ ప్రారంభం(ఓటీఏ): 2027, ఏప్రిల్. 
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • స్టేజ్–1 రాత పరీక్ష: యూపీఎస్​సీ నిర్వహిస్తుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ఐఎంఏ/ ఐఎన్ఏ/ ఏఎఫ్ఏ అభ్యర్థులకు మూడు పేపర్లు ఉంటాయి. ఇంగ్లిష్​ (100 మార్కులు), జనరల్ నాలెడ్జ్ (100 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (100 మార్కులు) మొత్తం 300 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 
  • ఓటీఏ అభ్యర్థులకు రెండు పేపర్లు ఉంటాయి. ఇంగ్లిష్ (100 మార్కులు), జనరల్ నాలెడ్జ్ (100 మార్కులు) మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 
  • స్టేజ్–2 సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (ఎస్ఎస్​బీ) ఇంటర్వ్యూ: 300 మార్కులకు ఉంటుంది. 
  • స్టేజ్–1, 2 పరీక్షల్లో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.33 మార్కులు కోత విధిస్తారు. 
  • తుది ఎంపిక: రాత పరీక్ష, ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్​నెస్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. 
  • పూర్తి వివరాలకు upsc.gov.in 
  • వెబ్​సైట్​ను సందర్శించండి. 
  • శిక్షణ: మిలటరీ అకాడమీకి ఎంపికైన వారికి డెహ్రాడూన్​లోని ఇండియన్ మిలటరీ అకాడమీ, నేవల్ అకాడమీకి ఎంపికైన వారికి కేరళలోని  ఎజిమాలలోని ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్​ఫోర్స్ అకాడమీకి ఎంపికైన వారికి హైదరాబాద్​లోని ఇండియన్ ఎయిర్​ఫోర్స్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. 
  • ఉద్యోగం: శిక్షణ విజయవతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​ల్లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్ - లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలో కెరీర్ ప్రారంభం అవుతుంది. 

►ALSO READ | ఏఎంపీఆర్ఐలో టెక్నికల్ పోస్టులు .. రూ. 35 వేల నుంచి లక్షా 12 వేల వరకు జీతం