సత్తుపల్లి ఘటనపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ

సత్తుపల్లి ఘటనపై  బీజేపీ నిజనిర్ధారణ కమిటీ

హైదరాబాద్, వెలుగు: ఈ నెల18న బీసీ రిజర్వేషన్ల బంద్ సందర్భంగా బీజేపీ నేతలపై జరిగిన దాడిని ఆ పార్టీ సీనియస్​గా తీసుకున్నది. దీనిపై నిజనిర్ధారణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించారు. కమిటీలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్​గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతికిరణ్ ఉన్నారు.

 కాగా, బంద్ రోజున బీజేపీ నేతలు ఈవీ రమేశ్, నాయుడు రాఘవరావు, పాలకొల్లు శ్రీనివాస్​పై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. పలువురు నేతలపైనా పోలీసులు దొమ్మి కేసులు నమోదు చేశారని  ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కాగా, బీజేపీ నిజనిర్ధారణ కమిటీ.. క్షేత్రస్థాయిలో పర్యటించి, పోలీసు అధికారులతో మాట్లాడి రాష్ట్ర పార్టీకి నివేదిక అందించనున్నది.