ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తే కుక్కల్ని కాల్చినట్లు కాల్చేయాలి

ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తే కుక్కల్ని కాల్చినట్లు కాల్చేయాలి

ప్రజల ఆస్తులను ధ్వంసం చేసే నిరసనకారులను కుక్కల్ని కాల్చినట్లు కాల్చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్ళు నాశనం చేస్తున్న పబ్లిక్ ప్రాపర్టీ ఎవరిదనుకుంటున్నారు. ఇదేమైనా వాళ్ల అబ్బ సొత్తు అనుకుంటున్నారా? ట్యాక్స్ పేయర్స్‌కు చెందిన ఆస్తులివి. మీరు ఇక్కడికి ఇష్టానుసారం వచ్చేస్తారు. ఇక్కడే ఉంటూ.. మా తిండి తింటూ ప్రజల ఆస్తుల్ని ధ్వంసం  చేస్తున్నారు. ఇదేం మీ జమీందారీ కాదు. మేం లాఠీలతో మీ ఒళ్లు పగలకొడుతాం. తుపాకీతో కాల్చేస్తాం. జైళ్లలో పెడతాం. దేశంలో మొత్తం 2 కోట్ల మంది అక్రమంగా చొరబడిన ముస్లింలు నివసిస్తుంటే.. అందులో కోటి మంది పశ్చిమ బెంగాల్‌లోనే ఉన్నారు. వాళ్లను సీఎం మమతా బెనర్జీ కాపాడుతున్నారు’’ అని అన్నారు. ఆదివారం నదియా జిల్లాలో జరిగిన ఓ సభలో దిలీప్ ఘోష్ మాట్లాడారు. CAAకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారినా, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నా మమతా బెనర్జీ ప్రభుత్వం లాఠీ చార్జికి ఆదేశించకపోవడాన్ని తప్పుబట్టారు.

రైల్వే సహా పలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నా మమతా బెనర్జీ పోలీసులు నిరసనకారులకు కంట్రోల్ చేయడానికి ఏ యాక్షన్ తీసుకోలేదని ఆరోపించారు దిలీప్ ఘోష్. ఆ చొరబాటుదారులు ఆమె ఓటర్లని, అందుకే ఏమీ చేయలేదని అన్నారు. యూపీ, అస్సాం, కర్ణాటకల్లో తమ ప్రభుత్వాలు ఇలాంటి వాళ్లను కుక్కల్ని కాల్చినట్లు కాల్చిపడేశాయని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసేవాళ్లకు ఇదే సరైన శిక్ష అన్నారు.