కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన కూడా సీఎం కావచ్చు : డీకే శివకుమార్‌

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన కూడా సీఎం కావచ్చు : డీకే శివకుమార్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ పార్టీల ప్రచార పోరు ఊపందుకుటుంది.  ఈ క్రమంలో అధికార బీజేపీ కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు.  మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పపై సొంత పార్టీనే తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోందని ఆరోపించారు. నాలుగు సార్లు సీఎం అయన్ను పార్టీ, ఏజెన్సీల నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని శివకుమార్‌ ఆరోపించారు.   పార్టీ యడియూరప్పను వేధిస్తోందన్న విషయం బహిరంగ రహస్యమేనని, కన్నడ వీధుల్లో ఆయన కన్నీళ్లు పారాయని అన్నారు.   

రాష్ట్రంలో 140 స్థానాలను  గెలుచుకుని అధికారంలోకి వస్తామని డీకే శివకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం కావచ్చునని  అన్నారు. ఖర్గే ఉన్నతస్థాయి నేత అని శివకుమార్‌ కొనియాడారు.  ఖర్గేకు  51 ఏళ్ల అనుభవం ఉందని, ఆయనకు ఇప్పటివరకు సీఎంగా  అవకాశం రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఖర్గే కోరుకుంటున్నారని, ఆయన మనోభావాలను గౌరవిస్తున్నామని శివకుమార్ తెలిపారు.