రాష్ట్రంలో గూండాలు రాజ్యమేలుతున్నరు : బీజేపీ కిసాన్ మోర్చా

రాష్ట్రంలో గూండాలు రాజ్యమేలుతున్నరు : బీజేపీ కిసాన్ మోర్చా

రాష్ట్రంలో ప్రస్తుతం గూండాలు రాజ్యమేలుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా నేతలు ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. తప్పుల తడకగా మారిన ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకుని రైతుల భూములు కాజేసేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని నేతలు ఆరోపించారు. అందులో లోపాల వల్ల లక్షలాది మంది అన్నదాతలు నష్టపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

అంతకు ముందు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ కిసాన్ మోర్చా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దశలవారీగా ముట్టడికి వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ధరణి పోర్టల్ లోపాలను సవరించేదాకా ఉద్యమం కొనసాగుతుందని కిసాన్ మోర్చా నేతలు తేల్చిచెప్పారు.