డిసెంబర్‌‌‌‌లోపు రాష్ట్రంలో సీఎం మార్పు  : బీజేఎల్పీ నేత మహేశ్వర్‌‌‌‌ రెడ్డి

డిసెంబర్‌‌‌‌లోపు రాష్ట్రంలో సీఎం మార్పు  : బీజేఎల్పీ నేత మహేశ్వర్‌‌‌‌ రెడ్డి

భైంసా, వెలుగు: రాష్ట్రంలో డిసెంబర్​లోపు సీఎం మారబోతున్నారని బీజేఎల్పీ నేత, నిర్మల్‌‌‌‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్‌‌‌‌ రాష్ట్ర నాయకులు ఢిల్లీలో డ్రామాకు తెరలేపారని విమర్శించారు. గురువారం నిర్మల్‌‌‌‌ జిల్లాలోని భైంసాలో ఎమ్మెల్యే రామారావు పటేల్‌‌‌‌తో కలిసి మహేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీలో నిరసన చేపడితే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంకతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్‌‌‌‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తదితర ముఖ్యనేతలు ఎందుకు హాజరు కాలేదని  ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్‌‌‌‌ చేస్తున్న డ్రామా ప్రజలకు, పార్టీ హైకమాండ్‌‌‌‌కు అర్థమైపోయిందని, రాష్ట్రంలో సీఎం మారనున్నారన్నదానికి ఇదే సంకేతమని అన్నారు.