
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై బీజేపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ ఫైర్ అయ్యారు. దమ్ముంటే బాల్క సుమన్ తన నియోజకవర్గంలో దళిత బంధు ఇప్పించాలన్నారు. నువ్వు దళిత బిడ్డవైతే దళిత సీఎం, మూడు ఎకరాల భూమిపై సీఎం కేసీఆర్‌ను నిలదీయాలన్నారు. ఎంగిలి మెతుకులు తినే బాల్క సుమన్‌కు.. బండి సంజయ్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. సంజయ్ పిలుపిస్తే నీ నియోజకవర్గం కూడా దాటవ్ అని హెచ్చరించారు. బాల్క సుమన్ దళిత ద్రోహి అని మండిపడ్డారు.