- బీపేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు
లింగంపేట, వెలుగు : ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కొందరు రాజకీయ నేతలు దుష్ప్రచారం చేయడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గ్రామీణ పేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్మిషన్ గ్రామీణ్ యోజన (వీబీ జీ రామ్‌జీ) గా పేరు మార్చిందని, దీనిని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు.
ఉపాధి హామీ పథకం కింద గతంలో 100 రోజుల పనిదినాలు కల్పించగా, ప్రస్తుతం 125 రోజుల పని దినాలు కల్పించనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గరిడే రవీందర్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు హోటల్శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు దత్తు రాములు, దుర్శెట్టి రవి, పెద్దిశివయ్య, నవీన్‌కుమార్, మోతె మల్లయ్య, బొల్లు గణేశ్, శ్రీనివాస్‌గౌడ్, రాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.
