పేదల స్థలంలో నర్సింగ్ కాలేజ్ కట్టడం ఏంటి?

పేదల స్థలంలో నర్సింగ్ కాలేజ్ కట్టడం ఏంటి?

2012లోనే గద్వాల టౌన్ లో 78 ఎకరాల పట్టా భూమిని పేదల ఇళ్లకోసం సేకరించామన్నారు బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ . తాను మంత్రిగా ఉన్నప్పుడే పట్టాలు కూడా పంపిణి చేశానని చెప్పారు. పేదలకు కేటాయించిన స్థలంలో నర్సింగ్ కాలేజ్ కట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇండ్లు కట్టించాల్సిన ప్రభుత్వమే.. పేదల భూములు తీసుకోవడం దారుణమన్నారు. పేదల భూములు గుంజుకుంటే ఉరుకోబోమన్నారు డీకే అరుణ.