
దిండుగల్ (తమిళనాడు): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలతో సామాన్యులు, పేదలు, మిడిల్ క్లాస్, ఇతర వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించిందని బీజేపీ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నేషనల్ కోఇంచార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోందని తెలిపారు. ఆదివారం తమిళనాడులోని దిండుగల్ సిటీలో జరిగిన బీజేపీ బూత్ లెవల్ మెంబర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సామాన్యుల కోసం జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంలో సుధాకర్ రెడ్డి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్, ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ తమిళనాడు నేషనల్ ఇంచార్జ్ అర్వింద్ మీనన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణ, బీజేపీ నేషనల్ మహిళా మోర్చా ప్రెసిడెంట్, ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, బీజేపీ తమిళనాడు జనరల్ సెక్రటరీ కేశవ్ వినాయకన్, తదితరులు పాల్గొన్నారు.