లోకల్ బాడీస్ ఎన్నికల్లో సత్తాచాటాలి : దుగ్యాల ప్రదీప్ రావు

లోకల్ బాడీస్ ఎన్నికల్లో సత్తాచాటాలి : దుగ్యాల ప్రదీప్ రావు

మంచిర్యాల, వెలుగు: రానున్న లోకల్ బాడీస్​ఎన్నికల్లో సత్తా చాటేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ స్టేట్​జనరల్​ సెక్రటరీ దుగ్యాల ప్రదీప్​ రావు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం పార్టీ మంచిర్యాల జిల్లా ఆఫీస్​లో వర్క్​షాప్​ నిర్వహించారు. పాల్గొన్న ప్రదీప్​మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని, అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. 

జిల్లాలో 9 జడ్పీటీసీలు, మెజారిటీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లతో పాటు జిల్లా పరిషత్​ను కైవసం చేసుకునేలా కృషి చేయాలన్నా. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గౌడ్, మాజీ అధ్యక్షుడు రఘునాథ్ ​రావు, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ప్రభారీ ఎడ్ల అశోక్ పాల్గొన్నారు. 

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

ఆదిలాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సంసిద్ధం కావాలని ఆదిలాబాద్​ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం భోరజ్​లో నిర్వహించిన పార్టీ మండల వర్క్​షాప్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మెజార్టీ స్థానాలు గెలిచేలా కృషి చేయాలన్నారు. పెండల్ వాడకు చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పార్టీలో చేరగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.