
మెదక్: కొండాపూర్ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్‌ను బీజేపీ నేత సంగప్ప కలిశారు. మనూరు మండలంలోని డోవ్వూరు హనుమాన్ గుడి వద్ద శ్రీరామ మందిర సమర్పణ నిధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన కలిశారు. పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ తో కలిసి డోవుర్, మణుర్, మాయకోడ్, బాదల్ గాం, బెల్లాపూర్, పులకుర్తి తదితర గ్రామాల్లో నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డవుర్ నుంచి ఫుల్‌కుర్తి వరకు బైక్ ర్యాలీ
పల్లెపల్లెలో అందర్నీ కలుస్తూ.. యువతను పెద్ద ఎత్తున సమీకరిస్తూ ముందుకు సాగారు బీజేపీ నేత సంగప్ప. కాషాయ జెండాలను రెపరెపలాడిస్తూ.. డవుర్ నుంచి ఫుల్‌కుర్తి వరకు యువకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నారాయణఖేడ్ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్తిరి రామకృష్ణ, మారుతి రెడ్డి, భజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి జంగం రజినీకాంత్, రాజేష్ గౌడ్, పట్నం మాణిక్, సంజీవ్ పాటిల్ తో పాటు ఈశ్వరప్ప ఆయా గ్రామాల ప్రముఖులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రేటింగ్స్ ఫిక్స్ చేయడానికి అర్నాబ్ నాకు డబ్బులిచ్చారు
టొమాటోలు… ఆరు నెలలు దాచుకోవచ్చు
దేశంలో మోడర్నా వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు టాటా యత్నాలు