పనికి రాని భవనాల కోసం నిధులు వృధా: వివేక్

పనికి రాని భవనాల కోసం నిధులు వృధా: వివేక్

కేసీఆర్ ది కుటుంబ, నియంతృత్వ పాలన అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. కేసీఆర్ అబద్ధాల చెప్పె మోసగాడని ఆయన విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడం జిల్లాలోని కొత్తగూడం క్లబ్ లో బీజేపీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ పై వ్యాఖ్యలు చేశారు. ‘దుబ్బాక , హుజూరాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని కేంద్రానికి ముందే నివేదిక ఇచ్చాను. ఈటలను బీజేపిలో చేర్చడంలో కీలక పాత్ర పోషించాను. ఈటల గెలుపుకు తీవ్రంగా కృషి చేశాను. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాం. గడిచిన ఏడు సంవత్సరాలలో తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని చూపెట్టి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నాడు. కేసీఆర్ కు వ్యతిరేకమైన వాతావరణం తెలంగాణలో ఏర్పడింది. మందులో ‘రా’ పోస్తాడని సంతోష్ కి రాజ్యసభ సీటు ఇచ్చాడు. ఉమ్మడి రాష్ట్రానికి సరిపోయిన సెక్రటేరియట్.. తెలంగాణకు సరిపోదని కొత్తది నిర్మిస్తున్నాడు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టడానికి నిధులులేవని.. పనికి రాని భవనాల కోసం వినియోగిస్తున్నాడు. కేసీఆర్ వల్ల సింగరేణి సంస్థలో ఉద్యోగాలు తగ్గాయి. కేసీఆర్ అబద్ధాల కోరి, మోసగాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని మరిచిపోయాడు. కేసీఆర్ ఖజానా ఖాళీ అయినందునే రైతుబంధు పథకాన్ని నిలిపేయాలని చూస్తున్నాడు. రూ. 10 రూపాయలతో నిర్మించే ప్రాజెక్టుకు వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికీ ఒక్క నీటి బొట్టు రాలేదు. కేంద్రం మంచి పథకాలు అమలు చేస్తోంది. కేంద్ర నిధులను రాష్ట్రాలు సరిగా వినియోగించుకుంటే.. కేంద్రం డైరెక్ట్ గా స్కీం ఫండింగ్ చేయడానికి కృషి చేస్తున్నాను. ప్రపంచంలోనే ఎక్కువ వ్యాక్సినేషన్ ఇండియాలోనే జరుగుతోంది’ అని వివేక్ అన్నారు.

For More News..

రెచ్చిపోయిన ఫోన్ స్నాచర్స్.. స్కూటీపై వచ్చి..

మాంసానికి డిమాండ్.. వీధి కుక్కల స్మగ్లింగ్

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని సూసైడ్