కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభ పడింది కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభ పడింది కేసీఆర్

కరీంనగర్ జిల్లా మంథని మండలంలో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. మంథని మండలంలోని కాన్ సాయి పేట్ లో బిజెపి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ ల వల్ల ముంపుకు గురవుతున్న రైతులు.. తమకు టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు. మంథని మండలంలోని మల్లారం గ్రామ శివారులో నిర్మించిన సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ ల వల్ల ముంపుకు గురవుతున్న భూములను రైతులతో పాటు వెళ్లి పరిశీలించారు.  ముంపుకు గురవుతు పంట నష్టపోతున్న రైతులను ఆయన ఓదార్చారు. బాధితుల తరఫున న్యాయం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వంతో కోట్లాడతాం అని వారికి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో మూడేళ్లుగా పంటలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో లాభ పడింది కేసీఆర్, మెగా కృష్ణా రెడ్డియేనని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ముంపు రైతుల తరుపున పోరాటం చేస్తామన్నారు వివేక్. కేంద్ర జల శక్తి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. గ్రామ గ్రామాన బీజేపీ జెండా ఎగరెసి పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి: 

అగ్గిపెట్టెలో చేనేత చీర

నన్ను క్షమించు.. కావాలని కామెంట్ చేయలే