దళిత అమరులకు వివేక్ వెంకటస్వామి నివాళి

దళిత అమరులకు వివేక్ వెంకటస్వామి నివాళి

హైదరాబాద్ లకిడికపూల్ అంబేద్కర్ రిసోర్స్ సెంటర్ లో దళిత అమరుల శ్రద్ధాంజలి సభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఇటీవల మరణించిన దళిత  అమరవీరులకు నివాళులు అర్పించారు దళిత ప్రముఖులు. ఇటీవల అమరులైన దళిత ప్రముఖులు  ఆవుల బాలనాధం ( మాలల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు ), ఎ. విజయ చందర్ ( ఆల్ ఇండియా sc, st ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు )  బోగే రాజారామ్ ( తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు )కు నివాళులు అర్పించారు. వారి పోరాటాలను, సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

అమరుల సంస్మరణ సభ ఏర్పాటు చేసి అమరులను గుర్తు చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు వివేక్ వెంకటస్వామి. దళితుల సమస్యల పై జీవితాంతం పోరాటం చేసిన ప్రముఖులు బాలనాధం గారు, విజయ్ చందర్ గారు, బోగే రాజారామ్ గారు ... అంటూ కొనియాడు. వీళ్ళు తమ తండ్రి వెంకటస్వామి గారికి దళిత సమస్యలు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండేవారన్నారు. విజయ్ చందర్ గారు కూడా చాలా సమస్యల పై పోరాడారన్నారు వివేక్. ఎంతో మంది పేద విద్యార్థులను మా అంబేద్కర్ కాలేజీ లో జాయిన్ చేయించారన్నారు. విద్యార్థులకు దిశా నిర్దేశం చేసేవారన్నారు. 

బోగే రాజారామ్ గారు చనిపోయినపుడు వెంటనే మంథని కి వెళ్ళానని తెలిపారు వివేక్. సంతాప సభకు కూడా హాజరు అయ్యారని పేర్కొన్నారు. మంథని ప్రాంతంలో దళిత సమస్యలు చాలా ఉండేవన్నారు. అప్పటి ఎమ్మెల్యే ( పుట్ట మధు ) బోగే రాజారామ్ గారిని భూ వివాదంలో బాగా ఇబ్బంది పెట్టారన్నారు. ఈ విషయం పై అప్పటి మంత్రి హరీష్ రావుతో కూడా చెప్పానన్నారు. ఈ ముగ్గురు ప్రముఖులు కూడా దళిత జాతి అభివృద్ధి కోసం నిత్యం కృషి చేశారన్నారు వివేక్ వెంకటస్వామి. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. వీళ్ళు బతికి ఉన్నపుడు చాలా మంది వచ్చారు, కానీ వీళ్ళు చనిపోయినపుడు నివాళులు అర్పించడానికి తక్కువ మంది వచ్చారన్నారు. ఈ ముగ్గురు ప్రముఖులు చనిపోయినపుడు తాను వెళ్లానన్నారు వివేక్. మనలో మనకు ఎన్ని సంఘాలు ఉన్న కూడా.. అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ముగ్గురి ప్రముఖుల విగ్రహాలు పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. వాళ్ళను గౌరవించాలసిన బాధ్యత మన పై ఉన్నదన్నారు.