బోధన్, వెలుగు : ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని బీజేపీ లీడర్లు శుక్రవారం బోధన్ ఏసీపీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు గోపి కిషన్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, ఆటోలను సీజ్ చేయాలన్నారు. బోధన్, సాలూర మండలాల సరిహద్దు గ్రామాలైన కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గావ్, బిక్నెల్లి, మందర్నా గ్రామాల నుంచి రాత్రి, పగలు అన్న తేడాలేకుండా ఇసుక తరలిస్తున్నారన్నారు.
ఇసుక వాహనాల వల్ల వారంరోజుల్లో కల్దుర్కి, హున్సా గ్రామానికి చెందిన ఇద్దరు యాక్సిడెంట్లో మరణించారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, పట్టణ ప్రధాన కార్యదర్శులు మీర్జాపురం అరవింద్, రాజులదేవి పవన్ కుమార్, సీనియర్ నాయకులు హన్మండ్లు చారి, కందికట్ల వాసు, పెరక వెంకటేశ్, గుంత గంగాధర్, పట్టణ ఉపాధ్యక్షుడు గాదె సందీప్, కార్యదర్శులు గంగుల శ్రీకాంత్, శివరాజ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతం గౌడ్, నాయకులు బొడ్డు సురేష్, మళ్లారం దత్తు, కిరణ్, ప్రకాష్ ,శ్రీను, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
