ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం..

ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం..

కాంగ్రెస్​ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి ఖర్గే.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారంటూ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రులకు, ఖర్గేకు మధ్య పార్లమెంట్ లో డైలాగ్ వార్ నడిచింది.  బీజేపై చేసిన వ్యాఖ్యలకు ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఖర్గే మాత్రం తాను పార్లమెంట్ బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.

అంతే కాకుండా తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదని, ఇప్పటికీ ఆ వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని ఖర్గే తెలిపారు. దేశం కోసం బీజేపీ నుంచి ఎవరూ ప్రాణ త్యాగం చేయలేదన్నారు. అధికారపక్షం, ప్రతిపక్షాల వాదనలతో రాజ్యసభ వాయిదాల పర్వం నడిచింది.