
- సభా మర్యాదలు దెబ్బతీశారు : అమిత్ షా
న్యూఢిల్లీ : హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై బీజేపీ నేతలు మండిపడ్డారు. రాహుల్ దృష్టిలో హిందువులంటే.. హింసను ప్రేరేపించేవాళ్లని విమర్శించారు. తమను తాము హిందువులుగా భావించే వాళ్లను రాహుల్ అవమానించారని హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. హౌస్‌తో పాటు హిందువులకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హిందువుల ఫీలింగ్స్‌తో రాహుల్ ఆటలాడుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ‘‘హిందువులని చెప్పుకునే వాళ్లంతా హింసకు పాల్పడ్తారనేది రాహుల్ ఆలోచన. దేశంలోని కోట్లాది మంది తాము హిందువులమని చెప్పుకుంటారు. అంటే.. వాళ్లంతా హింసకు పాల్పడ్తారనా? హింసను ఏ మతంతో కూడా లింక్ చేయొద్దు. రాహుల్ క్షమాపణ చెప్పాలి’’అని అమిత్ షా అన్నారు.