డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి : కేఎస్ రత్నం

డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి : కేఎస్ రత్నం

చేవెళ్ల, వెలుగు: డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం తెలిపారు. తొమ్మిదన్నరేండ్ల పాలనలో దళితులు, రైతులు, గిరిజనులు, నిరుద్యోగులు ఇలా అందరినీబీఆర్ఎస్ సర్కారు మోసం చేసిందని ఆయన ఆరోపించారు. గురువారం షాబాద్ మండలంలోని మద్దూర్ గ్రామంలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్పతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కేఎస్ రత్నం మాట్లాడుతూ.. ఈసారి తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనన్నారు. చేవెళ్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను గతంలో గెలిపించారని వాళ్లు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.  ఈసారి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని కేఎస్ రత్నం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని విమర్శించారు. ఈ రెండు పార్టీలను నమ్మి మరోసారి మోసపోవద్దని కోరారు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే కేంద్ర సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన తెలిపారు.