
త్రిపుర అసెంబ్లీలో ఓ వైపు సీరియస్ గా సమావేశాలు జరుగుతుండగా ఓ ఎమ్మెల్యే తన మొబైల్ లో దర్జాగా అశ్లీల వీడియో చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకేముందు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ప్రతిపక్ష నేతలు , నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు.
త్రిపుర బాగ్‌బాసా నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జదబ్ లాల్ నాథ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ జరుగుతున్నప్పుడు అతను తన ఫోన్‌లో అశ్లీల వీడియో చూస్తున్నారు. ఈ తతంగాన్ని ఆయన వెనకాల ఉన్న మరో ఎమ్మెల్యే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆ ఎమ్మెల్యేపై పైర్ అవుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించకుండా ఈ పాడుబుద్దేంటూ ప్రశ్నిస్తున్నారు. చట్టసభల్లో ఇవేం పనులంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేతలనా తాము ఎన్నుకున్నదంటూ మండిపడుతున్నారు.
చట్ట సభల్లో అశ్లీల వీడియోలు చూస్తు పట్టబడడం ఇదే మొదటి సారి కాదు. గతంలో 2012లో కర్ణాటక అసెంబ్లీలో అప్పటి బీజేపీ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు లక్ష్మణ్ సవాది, సీసీ పాటిల్ తమ మొబైల్ ఫోన్‌లలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. దాని తరువాత వారిద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇటీవల బీహార్‌లోని పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్లోని టీవీ స్క్రీన్‌లపై దాదాపు మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియోలు ప్లే కావడం కూడా కలకలం రేపింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన రైల్వే శాఖ అధికారులు స్క్రీన్‌లలో యాడ్స్ రన్ చేసే కాంట్రాక్ట్ తీసుకున్న దత్తా కమ్యూనికేషన్ పై కేసు నమోదు చేశారు.