తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి  సిద్దం కావాలి

V6 Velugu Posted on Dec 01, 2021

కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో నిర్భందాలు, అణిచివేతలు కొనసాతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుడు తనకు నచ్చిన పార్టీలో ఉండే అవకాశం, ఓటరు తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని చెప్పారు. తెలంగాణ అమరవీరుడు పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ లో ఈటల నివాళులర్పించారు. ఉద్యమాలతో ఎదిగిన కేసీఆర్.. ఉద్యమాలే లేకుండా చేయాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. స్వేఛ్చ, హక్కులు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి  సిద్దం కావాలని ఈటల పిలుపు ఇచ్చారు.

 

For More News..

చనిపోయిన రైతుల డేటా లేదనడం అవమానించడమే

ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు

Tagged Telangana, CM KCR, movements, Gunpark, BJP MLA Eatala Rajender , prepare for another movement, police kishtaiah

Latest Videos

Subscribe Now

More News