కేసీఆర్ ఎందుకు మెడ కోసుకోలే ?

 కేసీఆర్ ఎందుకు మెడ కోసుకోలే ?

తెలంగాణ ప్రభుత్వం వడ్ల కొనుగోలను కావాలనే ఆలస్యం చేస్తుందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ ప్రభుత్వానికి రైతుల పైన ప్రేమ లేదన్నారు. 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం,రా రైస్ కేంద్రానికి ఇంకా ఇవ్వలేదన్నారు. యాసంగి ప్రతి గింజను కొంటుంది అని కేంద్రం చెప్పిందన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రం నుంచి లేఖ రాలేదని కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పారన్నారు.  దేశంలో ఎక్కడ లేని పంచాయితీ తెలంగాణలో ఎందుకు వచ్చిందని సీఎంను ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు. రా రైస్ గా మార్చి ఇచ్చే ప్రతిగింజను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

తెలంగాణ వ్యవసాయ శాఖమంత్రి ఎం మాట్లాడుతున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు.  మీరు కొన్న వడ్లను ఎప్పుడు బియ్యంగా ఇస్తారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలున్న కావాలనే ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు.ఇంకా 40 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు ఎమ్మెల్యే.  మంత్రులకు ఢిల్లీలో ఇంకా ఏం పని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారా,గల్లీలో పని లేక ఢిల్లీకి వచ్చారా? అని ప్రశ్నించారు. హుజురుబాద్ ఎన్నికల బదాలయింపుగా సీఎం పగ సాగిస్తున్నారన్నారు. మెడ మీద కత్తి పెట్టారు అని అంటున్నారు...మీ మెడ మీద కత్తి పెట్టింది ఎవరు..? రైతుల కోసం కేసీఆర్ ఎందుకు మెడ కోసుకోలేదు? అంటూ రఘునందర్ నిలదీశారు. కేసీఆర్ ని అరెస్ట్ చేస్తామని తాము చెప్పలేదన్నారు. వారి పై ఏ కుంభకోణం ఉందొ వారే చెప్తే బాగుంటుందని సీఎంపై సెటైర్లు వేశారు. హుజురాబాద్ లో ఈటెల రాజేంద్ర గెలుపు తో తెలంగాణ మంత్రులకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. గతంలో కేసీఆర్,కేటీఆర్ లేకపోతే మంత్రులు ఢిల్లీ వచ్చే వారు కాదన్నారు. 

కేంద్రం లేఖ ఎందుకు ఇవ్వాలి,లోక్ సభలో స్పష్టంగా చెప్పిందన్నారు. కామారెడ్డి లో రైతు చనిపోతే అది మీకు వార్త కాదా తెలంగాణ ఆత్మగౌరవం ఇదేనా అంటూ నిలదీశారు. ఒక్క యూరియా గింజకుడా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఫ్రీగా ఇవ్వలేదని ఆరోపించారు దుబ్బాక ఎమ్మెల్యే.  బియ్యాన్ని దొంగదారి పట్టిస్తున్నారు,పక్కా రాష్ట్రాల నుండి దొంగదారి లో బియ్యాన్ని తీసుకొస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వెంటనే మంత్రులను ఢిల్లీ నుండి పిలిపించాలన్నారు. రైతు పండించే ప్రతి గింజ కొనేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. అప్పుడు వారితో కలిసి మేం కూడా ఢిల్లీకి వెళ్తామన్నారు రఘునందన్ రావు.

ఇవి కూడా చదవండి:

ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు

చలికి వణుకుతున్న ఏనుగులు.. రగ్గులు కప్పిన సిబ్బంది