ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు

ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో మరో ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. కెన్యా నుంచి చెన్నై మీదుగా తిరుపతికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఆమెకు ఒమిక్రాన్ సోకినట్లు ఇవాళ నిర్ణారణ అయ్యింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. వారందరికీ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన కెన్యా నుంచి మహిళ చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడ్నుంచి కారులో తిరుపతికి వచ్చింది. 12వ తేదీన తిరుపతిలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడంతో ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ తరలించారు. అయితే ఇవాళ వచ్చిన రిపోర్టుల్లో ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. 

మరోవైపు ఆమె కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. మరోవైపు ఆమెను క్వారంటైన్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు. తాజాగా నమోదైన కేసుతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి  రాష్ట్రానికి చేరుకున్న 45 మంది ప్రయాణికులకు టెస్టులు నిర్వహించారు. అందులో 9 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి తరలించామని వైద్య అధికారులు తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వందతులు నమ్మొద్దన్నారు. ప్రతీ ఒకరు విధిగా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్సీ పాటించాలన్నారు.

 

ఇవి కూడా చదవండి:

ఏపీ ప్రజలకు జగన్ శుభవార్త

మూడు పిల్లలకు జన్మనిచ్చిన పులి