కేటీఆర్ కు రాజాసింగ్ కౌంటర్

కేటీఆర్ కు రాజాసింగ్ కౌంటర్

ఓటీటీ షోల గురించి కేటీఆర్ సలహా అడగటం సిగ్గుచేటని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ కాలికి గాయం కావడంతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏవైనా బెస్ట్ ఓటీటీ షోస్ ఉంటే సూచించగలరని కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని తెలిపారు. లేదంటే వాజ్ పేయి, మోదీ చరిత్రను కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. ఇలా ఓటీటీ షోల గురించి కేటీఆర్ సలహా అడగటాన్ని రాజాసింగ్ సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు. అంతే కాకుండా ఎంపీల సస్పెషన్ గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్ కు లేదని విమర్శించారు. అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? అని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజసింగ్ ప్రశ్నించారు.